ఐపీఎల్ 14వ సీజన్ కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటగాళ్లు ముంబయికి చేరుకున్నారు. లీగ్‌కు ముందు క్రికెటర్లంతా వారం రోజుల పాటు తప్పనిసరి కఠిన క్వారంటైన్లో ఉండాల్సి ఉంది. అయితే ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో పాల్గొన్న ప్లేయర్లను మాత్రం నేరుగా బబుల్‌లోకి ప్రవేశించే అవకాశం కల్పించింది బీసీసీఐ.
మాజీ కెప్టెన్ దినేశ్ కార్తీక్, వరుణ్ చక్రవర్తి, రాహుల్ త్రిపాఠి, కమలేష్ నాగర్కోటి, సందీప్ వారియర్, వైభవ్ అరోరాతో పాటు సహాయ కోచ్ అభిషేక్ నాయర్, సహాయ బౌలింగ్ కోచ్ ఓంకార్ సాల్విలు ముంబయికి చేరుకున్నారు.
"ఇది క్వారంటైన్ సమయం. ఐపీఎల్ కోసం కేకేఆర్ ముంబయికి చేరుకుంది. మరి కొద్ది రోజుల్లో క్యాంప్ ప్రారంభం కానుంది." అని కేకేఆర్ తన అధికారిక ట్విట్టర్లో పేర్కొంది.