ప్రతిష్టాత్మక ఐపీఎల్‌కు ముందు దిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు అక్షర్ పటేల్‌కు కరోనా నిర్ధరణ అయింది. దీంతో ఈ సారి లీగ్ జరిగేది అనుమానంగానే మారింది. టోర్నీకి మరో వారం రోజుల సమయం మాత్రమే ఉండగా.. ఇప్పటికే వాంఖడే స్టేడియంలోని ఎనిమిది మంది స్టాఫ్‌కు కొవిడ్ పాజిటివ్‌గా తేలింది.
ఐపీఎల్: దిల్లీకి ఎదురుదెబ్బ- అక్షర్ పటేల్‌కు కరోనా! - ఐపీఎల్
14:07 April 03
ఐపీఎల్: దిల్లీకి ఎదురుదెబ్బ- అక్షర్ పటేల్‌కు కరోనా!
''దురదృష్టవశాత్తు అక్షర్ పటేల్‌కు కరోనా నిర్ధరణ అయింది. అతడు స్వీయ నిర్బంధంలో ఉన్నాడు. అన్ని మార్గదర్శకాలను పాటిస్తున్నాడు.'' అని ఫ్రాంఛైజీ వర్గాలు వెల్లడించాయి.
ఇదివరకే కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాడు నితీశ్ రాణాకు పాజిటివ్ వచ్చింది. తాజాగా చేసిన టెస్టుల్లో నెగెటివ్ నివేదిక వచ్చింది. కొవిడ్ నిర్ధరణ అయిన ఐపీఎల్ ఆటగాళ్లలో అక్షర్ రెండో క్రికెటర్.
ఇదీ చదవండి:'క్వారంటైన్‌ను ఎలా కరిగించాలో చెప్పండి'