చెన్నై సూపర్ కింగ్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మధ్య పోరు నాలుగోసారి టైటిల్ చేజిక్కించుకోవాలని చెన్నై సూపర్‌కింగ్స్ బరిలోకి దిగుతుంటే.. ఒక్కసారైనా కప్పు గెలవాలని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉవ్విళ్లూరుతోంది. అయితే ఈ రెండు జట్లు తమ ఆటగాళ్లపై భారీ ఆశలు పెట్టుకున్నాయి. ఈ మ్యాచ్‌లో చూడదగిన ఆటగాళ్లను ఒకసారి పరిశీలిద్దాం.
ఐపీఎల్లో తిరుగులేని ఆటగాళ్లలో రైనా ముందుంటాడు. 176 మ్యాచ్‌లు ఆడి 34.37 సగటుతో 4,985 పరుగులు సాధించాడు. ఈసారి ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్‌పై సీఎస్కే ఎక్కువ ఆశలే పెట్టుకుంది.
ప్రత్యర్థి ఎవరైనా చెలరేగి ఆడటంలో తనకు తానే సాటి. ఇప్పటికి 163 మ్యాచ్‌లు ఆడిన ఈ సారథి 38.35 సగటుతో 4,948 పరుగులు సాధించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యధిక పరుగులు సాధించిన రెండో ఆటగాడిగా కొనసాగుతున్నాడు.
ఈ దక్షిణాఫ్రికా ఆటగాడు స్టేడియంలో 360 డిగ్రీల్లో షాట్లు కొట్టగల సమర్థుడు. బౌలర్ ఎవరన్నది సంబంధం లేకుండా విభిన్నమైన ఆటతీరుతో అలరించడం డివిలియర్స్ ప్రత్యేకత. 141 మ్యాచ్‌లు ఆడిన ఈ బెంగళూరు ఆటగాడు 3,953 పరుగులు సాధించాడు.
ఇంగ్లండ్ యువ ఆటగాడు శామ్ బిల్లింగ్స్ సీఎస్కే తరఫున ఆడుతున్నాడు. డుప్లెసిస్ జట్టుకు దూరం అవగా ఇతడికి అవకాశం లభించింది. అయితే తొలి మ్యాచ్‌లో బరిలో దిగుతాడో లేదో చూడాలి.
దేశవాళీ మ్యాచ్‌ల్లో అదరగొట్టిన ఈ యువ సంచలనం.. ఐపీఎల్లో బెంగళూరు తరఫున ఆడుతున్నాడు. 5 కోట్ల భారీ మొత్తాన్ని చెల్లించి ఇతడిని దక్కించుకుంది ఈ ప్రాంఛైజీ. ఇపుడు అందరి చూపు ఈ యువ క్రికెటర్‌పైనే.