తెలంగాణ

telangana

ETV Bharat / sports

డే అండ్ నైట్ టెస్టులో విజయం మాదే: బంగ్లా కోచ్ - బంగ్లా కోచ్ రసెల్ బొమింగో

నవంబర్​ 22న భారత్​తో జరగనున్న రెండో టెస్టును డే అండ్ నైట్​​గా ప్రకటించిన నేపథ్యంలో... మ్యాచ్​ తమకే అనుకూలిస్తుందని అభిప్రాయపడింది బంగ్లాదేశ్​. ఇరు జట్లకూ గులాబీ బంతి ఆడిన అనుభవం లేనందున విజయావకాశాలు బంగ్లాదేశ్​కే ఎక్కువని తెలిపాడు ఆ జట్టు కోచ్ రసెల్ డొమింగో.

డే అండ్ నైట్ టెస్టులో విజయం మాదే: బంగ్లా కోచ్

By

Published : Oct 30, 2019, 10:42 AM IST

భారత్​-బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టును డే అండ్ నైట్​గా​ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పింక్ బాల్​తో​తొలిసారిగా ఆడనున్న ఇరుజట్లలో.. తమకే ఎక్కువ అనుకూలిస్తుందని బంగ్లా కోచ్ రసెల్ డొమింగో అభిప్రాయపడ్డాడు. గులాబీ బంతితో ఆడిన అనుభవం ఇరుజట్లకు లేదని, అయితే మ్యాచ్​ తమకే కలిసొస్తుందని అన్నాడు.

"టీమిండియా బలమైన జట్టని మాకు తెలుసు. వాళ్లు ప్రపంచ నెంబర్ వన్ జట్టు కావచ్చు. కానీ పింక్ బంతితో ఆడిన అనుభవం వారికి లేదు.. మాకూ లేదు. అయితే ఇది మా జట్టుకు గొప్ప అవకాశం. ఈ మ్యాచ్​ మాకు కలిసొచ్చే అవకాశముంది. ఈడెన్ గార్డెన్స్​లో భారీ సందడి నెలకొనబోతుంది. అన్ని ఫార్మాట్లలో మేటి జట్టైన టీమిండియాతో తలపడబోతున్నాం. ఈ సిరీస్​ను సవాల్​గా తీసుకుంటాం" - రసెల్ డొమింగో, బంగ్లాదేశ్ కోచ్

బంగ్లాదేశ్​తో నవంబరు 3 నుంచి 10 వరకు మూడు టీ 20ల సిరీస్​ ఆడనుంది టీమిండియా. నవంబరు 14 నుంచి 26 వరకు ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్​ల టెస్టు సిరీస్ జరగనుంది. తొలి మ్యాచ్​ ఇండోర్ వేదికగా జరగనుండగా, రెండో టెస్టు కోల్​కతా ఈడెన్​గార్డెన్స్​లో నిర్వహించనున్నారు.

ఇదీ చదవండి: విచిత్రమైన ఈ క్రికెట్​ బ్యాట్​లను ఎప్పుడైనా చూశారా..?

ABOUT THE AUTHOR

...view details