వచ్చే ఏడాది భారత్-ఇంగ్లాండ్ మధ్య జరగబోయే సిరీస్ షెడ్యూల్లో ఓ మార్పు జరిగింది. ఇరు జట్లు ఆడాల్సిన ఐదు టెస్టులను నాలుగు టెస్టులకే కుదించారు. ఈ విషయాన్ని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ స్పష్టం చేశాడు. ఫిబ్రవరి-మార్చి మధ్య ఈ టెస్ట్ సిరీస్ నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు వెల్లడించాడు. అయితే ఈ మార్పు ఎందుకు చేశారో కారణాన్ని చెప్పలేదు. సాధారణంగా పరిస్థితులన్నీ చక్కగా ఉండి ఉంటే ఈ ఏడాది సెప్టెంబర్లోనే ఇంగ్లాండ్తో సిరీస్ జరగాల్సింది. కానీ కరోనా కారణంగా వచ్చే ఏడాదికి వాయిదా వేశారు.
భారత్-ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ షెడ్యూల్లో మార్పు
వచ్చే ఏడాది భారత్-ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచులతో కూడిన టెస్ట్ సిరీస్ను నాలుగు మ్యాచులకే కుదించారు. ఈ విషయాన్ని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ తెలిపారు.
భారత్-ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్
అభిమానుల సమక్షంలోనే...
కరోనా నేపథ్యంలో స్టేడియంలో ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్లు జరుగుతున్నాయి. అయితే వచ్చే ఏడాది నుంచి అభిమానుల మధ్యే మ్యాచ్లు నిర్వహిస్తామని ఇటీవల ఆశాభావం వ్యక్తం చేశారు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు సీఈఓ టామ్ హారిసన్. జనవరి 12 నుంచి టికెట్లనూ అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. మ్యాచ్లు రద్దయినా, కరోనా కారణంగా వేదిక మారినా డబ్బులు వాపస్ చేస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి : భారత్-ఇంగ్లాండ్ 5 టెస్టుల షెడ్యూల్ ఇదే..
Last Updated : Nov 24, 2020, 10:36 PM IST