తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆఖరి టీ20 టీమిండియాదే.. సిరీస్ క్లీన్ స్వీప్​ - indian women

గయానా వేదికగా వెస్టిండీస్ మహిళలతో జరిగిన చివరి టీ20లో భారత అమ్మాయిలు 61 పరుగుల తేడాతో విజయం సాధించారు. ఐదు మ్యాచ్​ల సిరీస్​ను 5-0 తేడాతో క్లీన్ స్వీప్ చేశారు.

టీమిండియా మహిళలు

By

Published : Nov 21, 2019, 9:14 AM IST

వెస్టిండీస్ మహిళా జట్టుతో జరిగిన చివరి టీ20లో భారత అమ్మాయిలు జోరు కొనసాగిస్తున్నారు. చివరి టీ20లో 61 పరుగుల తేడాతో విజయం సాధించారు. ఫలితంగా ఐదు మ్యాచ్​ల సిరీస్​ను 5-0 తేడాతో కైవసం చేసుకున్నారు. టీమిండియా నిర్దేశించిన 134 పరుగుల లక్ష్యాన్ని ఛేదించబోయి 73 పరుగులకే పరిమితమయ్యారు విండీస్ అమ్మాయిలు.

గయానా వేదికగా జరిగిన ఈ మ్యాచ్​లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది భారత్. రోడ్రిగ్స్(50), వేధా కృష్ణమూర్తి(60) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. కరీబియన్ బౌలర్లలో మాథ్యూస్, ఆనిసా, అలెన్ చెరో వికెట్ తీశారు.

అనంతరం 135 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన విండీస్ 7 వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది. కరీబియన్ బ్యాట్స్​ఉమెన్​లో ఎవరూ రాణించలేక పోయారు. భారత అమ్మాయిల బౌలింగ్ ధాటికి వరుసగా పెవిలియన్​కు క్యూ కట్టారు. కిశోనా నైట్​దే(22) అత్యుత్తమ స్కోరు. టీమిండియా బౌలర్లలో అనుజా పాటిల్ రెండు వికెట్లతో ఆకట్టుకోగా.. రాధ, పూనమ్, పూజా వస్త్రాకర్, హర్లీన్ డియోల్ చెరో వికెట్ తీశారు.

ఇదీ చదవండి: 16 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం

ABOUT THE AUTHOR

...view details