అధిక ఒత్తిడి వల్లే మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్లో పరాజయం చవిచూసినట్లు తెలిపారు టీమ్ఇండియా మహిళా జట్టు చీఫ్ సెలెక్టర్ హేమలతా కాలా. తుదిపోరులో ఓటమి ఎదురైనా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఇప్పటికీ ఉత్తమ క్రీడాకారిణే అని ఆమె అభిప్రాయపడ్డారు.
"జట్టు సభ్యులు పెద్ద టోర్నీలు ఆడటానికి సిద్ధంగా ఉన్నా.. వారికి తగినంత అనుభవం లేదు. దాంతో పాటు బ్యాటింగ్ వైఫల్యం టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ను వెంటాడింది. పూర్తి ఒత్తిడితోనే మ్యాచ్‌ను ముగించారు. అదే విధంగా 2017 వన్డే ప్రపంచకప్‌లోనూ బ్యాటింగ్ పతనమైంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు గతంలో టీమ్ఇండియాను ఓడించడం వల్ల క్రీడాకారిణిలపై ఒత్తిడి పెరిగి తుదిపోరులో పరాజయానికి కారణమైంది. ఓటమి ఎదురైనా ప్రస్తుత జట్టుకు హర్మన్‌ప్రీత్ అద్భుతమైన నాయకురాలు అనడంలో ఎలాంటి సందేహం లేదు. వన్డే క్రికెట్ క్రికెట్ కెప్టెన్‌గా మిథాలీ రాజ్ తప్పుకున్న తర్వాత ఆ బాధ్యతలను హర్మన్‌ప్రీత్‌కు అందజేయనున్నాం".
- హేమలతా కాలా, భారత ఉమెన్స్ జట్టు చీఫ్ సెలెక్టర్