భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్టుల్లో అద్భుతమైన రికార్డు సాధించాడు. సుదీర్ఘ ఫార్మాట్లో వేగంగా 400 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఇందుకు అశ్విన్ 77 టెస్టులు తీసుకోగా.. శ్రీలంగ దిగ్గజ స్పిన్నర్ మురళీధరన్ 72 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించాడు.
అహ్మదాబాద్ వేదికగా జరుగుతోన్న పింక్ టెస్టులో ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో ఆర్చర్ వికెట్ తీసి.. ఈ ఫీట్ సాధించాడు యాష్. తాజా ఫీట్‌తో అశ్విన్.. న్యూజిలాండ్ బౌలింగ్ లెజెండ్ రిచర్డ్ హాడ్లీ, సౌతాఫ్రికా పేస్ దిగ్గజం డేల్ స్టెయిన్‌ను అధిగమించాడు. వీరిద్దరికీ ఈ రికార్డు అందుకోవడానికి 80 టెస్టులు పట్టింది.