విండీస్ పర్యటనలో ఉన్న భారత ఆటగాళ్లు ఆటకు కాస్త విరామం దొరకగానే అక్కడ దీవుల్లో జలకాలాటలు ఆడారు. వెస్టిండీస్ క్రికెటర్లు నికోలస్ పూరన్, కీరన్ పోలార్డ్‌తో కలిసి డైవింగ్ చేశారు. శ్రేయస్, శిఖర్ చేసిన బ్యాక్ ఫ్లిప్లు ఆకట్టుకుంటున్నాయి. ఈ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు ఆటగాళ్లు.
" సహజసిద్ధమైన నీరు.. చుట్టూ పచ్చదనం.. స్వచ్ఛమైన గాలి... ఆహా..! ఎంత బావుంది" అని పోస్ట్ చేశాడు ధావన్.