తెలంగాణ

telangana

By

Published : Jan 17, 2020, 9:32 PM IST

Updated : Jan 17, 2020, 9:48 PM IST

ETV Bharat / sports

దెబ్బకు దెబ్బ.. రెండో వన్డేలో భారత్ అద్భుత విజయం

రాజ్​కోట్​లో జరిగిన రెండో వన్డేలో భారత్ గెలిచింది. ఆస్ట్రేలియాపై 36 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్రస్తుతం 1-1తో సిరీస్​ సమమైంది. నిర్ణయాత్మక మూడో వన్డే.. ఆదివారం బెంగళూరులో జరగనుంది.

team india won
ఆసీస్​పై భారత్​ విజయం

ఆస్ట్రేలియాపై టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. తొలిమ్యాచ్​లో ఓటమికి బదులుగా రెండో వన్డేలో అద్భుత విజయం సాధించింది.భారత్‌ నిర్దేశించిన 341 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆసీస్‌ 49.1 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌటైంది. జట్టు మొత్తం సమష్టిగా రాణించి, ఆసీస్​పై 36 పరుగుల తేడాతో గెలిచింది. ముందు బ్యాట్స్​మెన్ రాణిస్తే, ఆ తర్వాత బౌలర్లు కంగారూల పని పట్టారు.

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ

టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన భారత్​కు.. ఓపెనర్లు శుభారంభమిచ్చారు. తొలి వికెట్​కు 81 పరుగులు జోడించారు. ఈ క్రమంలో 42 పరుగులు చేసి రోహిత్ ఔటయ్యాడు. తర్వాత ధాటిగా ఆడిన ధావన్.. ప్రత్యర్థి బౌలర్లను ఎదుర్కొని, సెంచరీకి చేరువయ్యాడు. అయితే 96 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జంపా బౌలింగ్​లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.

భారత బ్యాట్స్​మన్ కేఎల్ రాహుల్

కాసేపటికే అయ్యర్ ఔటవగా.. మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు కోహ్లీ-రాహుల్. వేగంగా ఆడే ప్రయత్నంలో జంపా బౌలింగ్​లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్​ చేరాడు విరాట్. చివర్లో రాహుల్ వీరవిహారం సృష్టించాడు. ఫోర్లు, సిక్సర్లతో ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడి, 80 పరుగులు చేశాడు. మొత్తంగా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 340 పరుగులు చేసింది భారత్. ఆసీస్​ బౌలర్లలో జంపా 3, రిచర్డ్​సన్ 2 వికెట్లు తీశారు.

అనంతరం ఛేదన ప్రారంభించిన ఆసీస్.. నెమ్మదిగా ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. త్వరగానే వార్నర్(15) వికెట్ పోగుట్టుకుంది. తర్వాత కాసేపటికే ఫించ్ 33 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన స్మిత్-లబుషేన్ మూడో వికెట్​కు 96 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

ఆస్ట్రేలియా బ్యాట్స్​మన్

ఈ క్రమంలో స్మిత్(98), లబుషేన్(46) కొద్దిలో సెంచరీ, అర్ధ సెంచరీలు మిస్ చేసుకున్నారు. మిగతా వారిలో ఎవరూ ఎక్కువసేపు క్రీజులో నిలబడలేకపోయారు. భారత బౌలర్ల ధాటికి తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. టీమిండియా బౌలింగ్​లో షమి 3.. సైనీ, జడేజా, కుల్​దీప్ తలో 2 వికెట్లు పడగొడితే, బుమ్రా ఓ వికెట్ తీశాడు.

ఇవీ చదవండి:

Last Updated : Jan 17, 2020, 9:48 PM IST

ABOUT THE AUTHOR

...view details