వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో గెలిచిన భారత మహిళా జట్టు టీ20లో ఆ స్థాయి ప్రదర్శన కనబర్చలేకపోయింది. ఇప్పటికే సిరీస్ కోల్పోయిన మంధాన సేన... ఆఖరి మ్యాచ్‌లో అయినా గెలిచి పరువు నిలుపుకోవాలని భావిస్తోంది. పొట్టి ఫార్మాట్లో భారత్ ఇప్పటికే ఆరు మ్యాచులు వరుసగా ఓడిపోయింది. వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్ ముందు ఇలాంటి ప్రదర్శన జట్టు మేనేజ్మెంట్ను కలవరపెడుతోంది.
రెగ్యులర్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ గాయంతో దూరమవగా స్మృతి మంధాన తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరిస్తోంది. రెండు మ్యాచ్‌ల్లోనూ టాప్ ఆర్డర్ విఫలమవడం జట్టుకు ఆందోళన కలిగిస్తోంది.
"రెండో టీ20లో ప్రత్యర్థి ముందు 112 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవడానికి బౌలర్లు కష్టపడ్డారు. మరో 10-15 పరుగులు సాధించి ఉంటే బాగుండేది. బౌలింగ్ విభాగం బాగున్నా బ్యాట్స్ ఉమెన్ రాణించాల్సిన అవసరం ఉంది".
-- స్మృతి మంధాన, కెప్టెన్