తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత్​ జోరుకు విండీస్​​ విలవిల- సిరీస్​ కైవసం - టెస్టు సిరీస్​

కరీబియన్​ టూర్​ను ఘనంగా ముగించింది భారత్​. జమైకా వేదికగా జరిగిన రెండో టెస్టులో 257 పరుగుల భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది కోహ్లీ సేన. తొలి ఇన్నింగ్స్​లో శతకం, రెండో ఇన్నింగ్స్​లో అర్ధశతకంతో చెలరేగిన విహారీకి మ్యాన్​ ఆఫ్​ ది మ్యాచ్​ అవార్డు దక్కింది.

భారత్​ జోరుకు వెస్టిండీస్​ విలవిల- సిరీస్​ కైవసం

By

Published : Sep 3, 2019, 1:08 AM IST

Updated : Sep 29, 2019, 6:01 AM IST

జమైకా వేదికగా జరిగిన రెండో టెస్టులో వెస్టిండీస్​పై భారత్ ఘన విజయం సాధించి సిరీస్​ను 2-0తో క్లీన్​ స్వీప్​ చేసింది. భారత బౌలర్ల ధాటికి రెండో ఇన్నింగ్స్​లో 210 పరుగులకు ఆలౌటైంది కరీబియన్​ జట్టు. ఫలితంగా వెస్టిండీస్​పై 257 పరుగుల భారీ విజయాన్ని అందుకుంది కోహ్లీసేన. తొలి ఇన్నింగ్స్​లో శతకం, రెండో ఇన్నింగ్స్​లో అర్ధశతకంతో విజృంభించిన హనుమ విహారీకి మ్యాన్​ ఆఫ్​ ది మ్యాచ్​ అవార్డు దక్కింది.

విహారీ

రెండో ఇన్నింగ్స్​లో షమి, జడేజా చెరో మూడేసి వికెట్లు పడగొట్టి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించారు. మొదటి ఇన్నింగ్స్​ హీరో బుమ్రా.. ఈసారి ఒక వికెట్​ తీయగా, ఇషాంత్​ శర్మ రెండు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. టీమిండియా బౌలర్లకు వెస్టిండీస్​ బ్యాట్స్​మెన్ ఎదురు నిలువలేకపోయారు. ఆ జట్టులో ఒక్క ఆటగాడు(బ్రూక్స్​) మినహాయిస్తే... మరెవరూ అర్ధశతకం కూడా చేయలేకపోయారు. రెండో ఇన్నింగ్స్​లో కరీబియన్​ జట్టులో ఆరుగురు సింగిల్​ డిజిట్​కే పరిమితమయ్యారు.

తొలి ఇన్నింగ్స్​లో విహారీ 111 పరుగులు, సారథి విరాట్​ కోహ్లీ 76 పరుగులతో ఆకట్టుకోవడం వల్ల భారత్​ 416 పరుగులు చేసింది. బుమ్రా ధాటికి తొలి ఇన్నింగ్స్​లో 117 పరుగులకే కుప్పకూలింది కరీబియన్​ జట్టు. టెస్టు కెరీర్​లో తొలిసారి హ్యాట్రిక్​ సాధించాడు బుమ్రా. వెస్టిండీస్​కు ఫాలో ఆన్​ అప్పగించకుండా... రెండో ఇన్నింగ్స్​లో బ్యాటింగ్​కు దిగిన కోహ్లీసేన నాలుగు వికెట్లు కోల్పోయి 168 పరుగుల వద్ద డిక్లేర్​ చేసిన సంగతి తెలిసిందే.

టెస్ట్​ ఛాంపియన్​షిప్​ను టీమిండియా ఘనంగా ప్రారంభించింది. ఇప్పటివరకు జరిగిన రెండు టెస్టుల్లోనూ భారీ తేడాతో గెలుపొంది తన సామర్థ్యాన్ని మరోసారి చాటి చెప్పింది కోహ్లీసేన. 120 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

కోహ్లీ
  1. భారత్​ తరఫున అత్యధిక టెస్టులు గెలిచిన వారి జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్నాడు కోహ్లీ(48 మ్యాచుల్లో 28 విజయాలు). విండీస్​తో రెండో టెస్టు విజయంతో మాజీ కెప్టెన్​ ధోనీ (60 టెస్టుల్లో 27 విజయాలు)ని వెనక్కినెట్టాడు విరాట్​.
  2. పరుగుల పరంగా టెస్టుల్లో టీమిండియాకు ఇది ఆరవ అతిపెద్ద విజయం.

ఇదీ చూడండి:- 'ఈ శతకం చూసి మా నాన్న గర్విస్తుంటారు'

Last Updated : Sep 29, 2019, 6:01 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details