భారత జట్టు ఫీల్డింగ్ ఇదేవిధంగా కొనసాగితే రానున్న టీ20 ప్రపంచకప్‌లో మరిన్ని మ్యాచ్‌లు ఓడిపోతుందని భారత మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ అన్నాడు. జట్టు పేలవంగా ఫీల్డింగ్ చేస్తోన్న నేపథ్యంలో కైఫ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
"క్యాచ్‌లు మిస్ చేయడం, ఫీల్డింగ్‌లో పొరపాట్లు జరగడం వంటివి ఆటలో భాగమవ్వకూడదు. 2021అక్టోబర్‌లో జరిగే ప్రపంచకప్ గెలవాలంటే భారత్ ఈ రకమైన ఫీల్డింగ్ విధానాన్ని మార్చుకోవాలి. లేదంటే కీలక మ్యాచ్‌ల్లో ఓటమిపాలయ్యే అవకాశముంది"
-మహ్మద్ కైఫ్, భారత మాజీ ఆటగాడు.