తెలంగాణ

telangana

ETV Bharat / sports

సెంచరీకి అడుగు దూరంలో కుల్దీప్​ యాదవ్​ - కుల్దీప్​ హ్యాట్రిక్‌

టీమిండియా బౌలర్​ కుల్దీప్​ యాదవ్​ మరో మైలురాయిని అందుకునేందుకు వికెట్​ దూరంలో ఉన్నాడు. ఇప్పటికి 54 వన్డేల్లో 99 వికెట్లు తీసిన ఈ చైనామన్​ బౌలర్​.. మరో ఒక్కరిని ఔట్​ చేస్తే 100 వికెట్ల ఫీట్​ అందుకోనున్నాడు. ప్రస్తుతం అతడు ఉన్న ఫామ్​ ప్రకారం రేపు కటక్​ వేదికగా విండీస్​-భారత్​ ఆఖరి వన్డేలో ఈ ఘనత సాధించే అవకాశాలున్నాయి.

Kuldeep Yadav
సెంచరీకి అడుగుదూరంలో కుల్దీప్​ యాదవ్​

By

Published : Dec 21, 2019, 4:48 PM IST

టీమిండియా చైనామన్​ బౌలర్​ కుల్దీప్ ​యాదవ్‌ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. వన్డేల్లో మరో వికెట్‌ తీస్తే వేగంగా 100 వికెట్లు దక్కించుకున్న భారత బౌలర్లలో ఒకడిగా నిలుస్తాడు. గతంలో మరో భారత పేసర్​ షమి ఇదే ఫీట్​ సాధించేందుకు 55 వన్డేలు అవసరమయ్యాయి. ప్రస్తుతం కుల్దీప్​ 54 వన్డేల్లో 99 వికెట్లు పడగొట్టాడు. రేపు కటక్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరగనున్న నిర్ణయాత్మక వన్డేలో కుల్దీప్ ఈ రికార్డును సాధిస్తాడని అందరూ భావిస్తున్నారు.

ఈ ఫీట్​ అందుకుంటే వన్డేలో 100 వికెట్ల క్లబ్‌లో చేరిన 22వభారత బౌలర్‌గా, 8వ స్పిన్నర్‌గా రికార్డులకెక్కుతాడు కుల్దీప్. అఫ్గానిస్థాన్​ లెగ్​ స్పిన్నర్​ రషీద్​ ఖాన్.. వన్డేల్లో​ 100 వికెట్లను వేగంగా తీసిన బౌలర్​గా చరిత్ర లిఖించాడు. 44 మ్యాచ్​ల్లోనే ఈ ఫీట్​ అందుకున్నాడు.

ఇటీవలే హ్యాట్రిక్​..

విశాఖ వేదికగా విండీస్‌తో జరిగిన రెండో వన్డేలో కుల్దీప్​ హ్యాట్రిక్‌ సాధించాడు. 33వ ఓవర్​ వరుస బంతుల్లో హోప్‌, హోల్డర్‌, జోసెఫ్‌ను ఔట్‌ చేశాడు. ఫలితంగా అంతర్జాతీయ వన్డేల్లో రెండుసార్లు హ్యాట్రిక్‌ నమోదు చేసిన తొలి భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. 2017లో ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో తొలిసారిగా హ్యాట్రిక్‌ తీశాడు కుల్దీప్​. ఇతడు అండర్​-19లోనూ హ్యాట్రిక్​ నమోదు చేయడం విశేషం.

ABOUT THE AUTHOR

...view details