తెలంగాణ

telangana

ETV Bharat / sports

కపిల్​దేవ్ రికార్డుపై కన్నేసిన ఇషాంత్ శర్మ - kumble

టీమిండియా బౌలర్ ఇషాంత్ శర్మ టెస్టుల్లో మరో వికెట్ తీస్తే.. భారత్ తరఫున ఆసియా బయట దేశాల్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్​గా నిలుస్తాడు.

ఇషాంత్

By

Published : Aug 29, 2019, 1:25 PM IST

Updated : Sep 28, 2019, 5:34 PM IST

వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా.. తొలి టెస్టులో ఘనవిజయం సాధించింది. ఆ మ్యాచ్​ తొలి ఇన్నింగ్స్​లో పేస్ బౌలర్ ఇషాంత్ శర్మ ఐదు వికెట్లతో సత్తాచాటాడు. శుక్రవారం రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్​లో మరో వికెట్ తీస్తే.. భారత దిగ్గజ బౌలర్ కపిల్​దేవ్​ను అధిగమిస్తాడు ఇషాంత్.

ఆసియా బయట దేశాల్లో అత్యధిక టెస్టు వికెట్లు తీసిన భారత బౌలర్లలో అనిల్ కుంబ్లే (200) అగ్రస్థానంలో ఉన్నాడు. కపిల్ దేవ్​ (155) రెండో స్థానంలో ఉన్నాడు. విండీస్​తో జరిగిన తొలి టెస్టులో ఎనిమిది వికెట్లు తీసిన ఇషాంత్​ (155) కపిల్ సరసన నిలిచాడు. మరో వికెట్ తీస్తే ఈ లెజెండరీ బౌలర్​ను అధిగమించి రెండో స్థానానికి వెళతాడు.

కరీబియన్ గడ్డపై ఇప్పటికే వన్డే, టీ20 సిరీస్​లను గెలిచిన కోహ్లీసేన... టెస్టుల్లోనూ గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది.

ఇవీ చూడండి.. భారత అమ్మాయితో.. మ్యాక్స్​వెల్​ ప్రేమాయణం!

Last Updated : Sep 28, 2019, 5:34 PM IST

ABOUT THE AUTHOR

...view details