తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత్​Xవిండీస్​ 'టీ20': ఇవి తెలుసుకోండి

నేడు జరగనున్న మొదటి టీ20 మ్యాచ్​తో  వెస్టిండీస్​ పర్యటనను ప్రారంభించనుంది టీమిండియా. మొదట టీ-20 సిరీస్​లో భాగంగా మూడు మ్యాచ్​లు ఆడనుంది భారత్​. ఈ సందర్భంగా.. టీమిండియా-విండీస్​ మధ్య కొన్ని ఆసక్తికర అంశాలు ఇప్పుడు చూద్దాం!

By

Published : Aug 3, 2019, 1:56 PM IST

Updated : Aug 3, 2019, 2:01 PM IST

టీమిండియా

భారత్​-వెస్టిండీస్​ టీ20 సిరీస్​ నేటి నుంచే ఆరంభం కానుంది. అమెరికా ఫ్లోరిడా వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్​లో కుర్రాళ్లకు అవకాశం కల్పించారు సెలక్టర్లు. మరి ఈ టీ20 సిరీస్​ సందర్భంగా కొన్ని ఆసక్తికర అంశాలను చూద్దాం.

ఇరుజట్లు టీ-20ల్లో ముఖాముఖి 11 సార్లు తలపడగా.. చెరో ఐదు పర్యాయాలు గెలిచాయి. ఓ మ్యాచ్​లో ఫలితం తేలలేదు. చివరగా విండీస్​లో ఆడిన 3 మ్యాచ్​ల్లో రెండింటిలో ఓడింది టీమిండియా.

టీమిండియా
  • 2016లో అమెరికా​లోని లౌదర్​హిల్ వేదికగా జరిగిన టీ20 మ్యాచ్​లో ఇరుజట్లు అత్యధిక స్కోర్లు నమోదు చేశాయి. ఆ మ్యాచ్​లో విండీస్ 245 పరుగులు చేయగా.. భారత్​ 4 వికెట్లు కోల్పోయి 244 పరుగులు చేసి త్రుటిలో ఓడింది.
  • ఇరుజట్ల మధ్య జరిగిన టీ20ల్లో విండీస్ ఆటగాడు ఎల్విన్ లూయిస్ అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించాడు. 62 బంతుల్లో 125 పరుగులతో ఆకట్టుకున్నాడు. 2017 కింగ్​స్టన్​ వేదికగా ఈ మ్యాచ్ జరిగింది. అత్యధిక సిక్సర్లు నమోదు చేసిన రికార్డూ లూయిస్ పేరిటే ఉంది.
  • లూయిస్ తర్వాత అత్యధికంగా రోహిత్ శర్మ 111 పరుగులు చేశాడు. 2018లో జరిగిన మ్యాచ్​లో ఈ స్కోరు సాధించాడు.
  • విండీస్​ గడ్డపై ఇరు దేశాల మధ్య ఇప్పటివరకు జరిగిన టీ20 మ్యాచ్​ల్లో అత్యధిక స్కోరు 194. ఆతిథ్య జట్టే ఈ రికార్డు నమోదుచేసింది.
  • ఇరుజట్లలో డారెన్ సామి ఉత్తమ బౌలింగ్ ప్రదర్శన చేశాడు. 2011లో పోర్ట్​ స్పెయిన్​లో జరిగిన మ్యాచ్​లో కేవలం 16 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు.

ఈ రోజు నుంచి సెప్టెంబర్​ 3 వరకు వెస్టిండీస్​లో పర్యటించనుంది భారత్​. మూడు టీ20లు, 3 వన్డేలు, రెండు టెస్ట్​ మ్యాచ్​లు ఆడనుంది టీమిండియా. ఈ పర్యటనలోనే కోహ్లీసేన ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ను ఆరంభించనుంది.

ఇది చదవండి: సాకర్​ దిగ్గజం​ మెస్సీపై 3 నెలల నిషేధం

Last Updated : Aug 3, 2019, 2:01 PM IST

ABOUT THE AUTHOR

...view details