భారత్-న్యూజిలాండ్ పోరుకు అంతా సిద్ధమైంది. టాస్ గెలిచిన కోహ్లీసేన.. బౌలింగ్ ఎంచుకుంది. ఆక్లాండ్ వేదికగా మ్యాచ్ జరగనుంది. ఈ మైదానం చిన్నది కావడం వల్ల భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశముంది. ఈ మ్యాచ్ గెలిచి, సిరీస్‌ను ఘనంగా ఆరంభించాలని ఇరుజట్లు భావిస్తున్నాయి. మరి ఎవరు గెలుస్తారో చూడాలి.
గతేడాది వన్డే ప్రపంచకప్ సెమీస్‌లో చివరగా భారత్-న్యూజిలాండ్ తలపడ్డాయి. అప్పుడు కివీస్ గెలిచింది. ఇప్పుడు దానికి బదులు తీర్చుకునేందుకు సిద్ధమైంది కోహ్లీసేన. అయితే వారిపై పగ, ప్రతీకారం లాంటివి ఏం లేవని భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పాడు. వారి దేశంలో కివీస్‌తో పోరు సవాలేనని, అందుకు తాము రెడీగా ఉన్నామని, అత్యుత్తమంగా ఆడతామని అన్నాడు.