1932 నుంచి నేటి వరకు భారత్- ఇంగ్లాండ్ జట్లు ఆడిన 122 టెస్టుల్లో ఎన్నో అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనలున్నాయి. ఫిబ్రవరి 5 నుంచి జో రూట్ సారథ్యంలోని ఇంగ్లాండ్‌తో నాలుగు టెస్టుల సిరీస్‌లో తలపడనుంది టీమ్ఇండియా. ఈ నేపథ్యంలో ఇరు జట్ల బ్యాట్స్‌మెన్ మరపురాని అత్యుత్తమ ప్రదర్శనలను గుర్తుచేసుకుందాం.
గ్రాహమ్ గూచ్-333
వేదిక: లార్డ్స్, 1990
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టెస్టులో 485 బంతుల్లో 333 పరుగులు చేశాడు గ్రాహమ్ గూచ్. 36 పరుగుల వద్దే అతడు ఓ క్యాచ్ ఇవ్వగా వికెట్‌కీపర్ కిరణ్ దానిని విడిచిపెట్టాడు. దీంతో చెలరేగిన గూచ్.. ఇంగ్లాండ్‌కు 653/4 పరుగుల భారీ స్కోరు అందించాడు. బదులుగా రవిశాస్త్రి(100), అజారుద్దీన్(121) సెంచరీలతో తొలి ఇన్నింగ్స్‌లో 454 పరుగులు చేసింది టీమ్ఇండియా. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 272/4 చేసి 472 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియా 224 పరుగులకే ఆలౌట్ అవడం వల్ల 247 పరుగుల భారీ తేడాతో ఇంగ్లాండ్‌కు విజయం దక్కింది.
కరుణ్ నాయర్- 303 నాటౌట్
వేదిక: ఎంఏ చిదంబరం మైదానం, చెన్నై, 2016
అప్పటికి తన మూడో టెస్టు మాత్రమే ఆడుతున్న కరుణ్.. 303 పరుగులతో అజేయంగా నిలిచి భారత్ తరఫున త్రిశతకం సాధించిన రెండో బ్యాట్స్‌మెన్‌గా చరిత్ర సృష్టించాడు. అతడి కన్నా ముందు వీరేంద్ర సెహ్వాగ్ ఉన్నాడు. కరుణ్ ఇన్నింగ్స్‌తో టీమ్ఇండియా కెరీర్లోనే అత్యధిక స్కోరు (759/7 పరుగులు) నమోదు చేసింది. ఆ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను 75 పరుగుల తేడాతో ఓడించింది టీమ్ఇండియా.
అలిస్టర్ కుక్- 294