తొలి సెషన్లో వెనువెంటనే వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్.. రెండో సెషన్లో ఆచితూచీ ఆడింది. ఓపెనర్లు విఫలమైన వేళ బెన్ స్టోక్స్(55) అర్ధ శతకంతో రాణించాడు. టీ విరామానికి ఇంగ్లాండ్ 5 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. ఈ సెషన్లో సిరాజ్, సుందర్ చెరో వికెట్ తీశారు. ప్రస్తుతం క్రీజులో ఓలీ పోప్(21*), డేనియల్ లారెన్స్(15*) ఉన్నారు.
టీ విరామానికి ఇంగ్లాండ్ 144/5.. స్టోక్స్ అర్ధసెంచరీ - మొతేరా టెస్టు
రెండో సెషన్లో నిలకడగా బ్యాటింగ్ చేసింది ఇంగ్లాండ్. 5 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. స్టోక్స్ అర్ధ శతకం సాధించాడు.
టీ విరామానికి: ఇంగ్లాండ్ 144/5.. స్టోక్స్ అర్ధసెంచరీ
రెండో సెషన్ ఆరంభంలోనే బెయిర్‌స్టో(28*) ను ఎల్బీగా పెవిలియన్ పంపించాడు సిరాజ్. ఆ తర్వాత ఓలీ పోప్‌తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దిన బెన్ స్టోక్స్ హాఫ్ సెంచరీతో ఇంగ్లాండ్‌ను పోటీలోకి తీసుకొచ్చాడు. 47వ ఓవర్లో వాషింగ్టన్ సుందర్ అతడిని బోల్తా కొట్టించాడు.
Last Updated : Mar 4, 2021, 2:25 PM IST