అహ్మదాబాద్ వేదికగా జరుగుతోన్న ఐదో టీ20లో విధ్వంసకర ఇన్నింగ్స్‌తో హాఫ్ సెంచరీ చేసిన భారత ఓపెనర్ రోహిత్ శర్మ.. పొట్టి ఫార్మాట్లో మరో రికార్డు నెలకొల్పాడు. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా హిట్‌మ్యాన్ రెండో స్థానంలో నిలిచాడు.
అత్యధిక టీ20 పరుగుల జాబితాలో రోహిత్@2 - India vs England: Rohit Sharma overtakes Martin Guptill to become 2nd highest run-scorer in T20Is
భారత ఓపెనర్ రోహిత్ శర్మ టీ20ల్లో మరో ఫీట్ సాధించాడు. పొట్టి ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ మార్టిన్ గప్తిల్‌ను అధిగమించాడు.
టీ20 పరుగుల జాబితాలో రోహిత్ రెండో స్థానం
తాజాగా.. న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ మార్టిన్ గప్తిల్‌ను అధిగమించాడు భారత వైస్ కెప్టెన్. ఈ జాబితాలో టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు.
ఇదీ చదవండి:షూటింగ్ ప్రపంచకప్: యశస్విని దేశ్వాల్కు స్వర్ణం