తెలంగాణ

telangana

ETV Bharat / sports

తొలి మ్యాచ్​ క్యాప్​ అందుకుంటూ కృనాల్ భావోద్వేగం

ఇంగ్లాండ్​తో తొలి వన్డేలో అరంగేట్రం చేశాడు హార్దిక్ పాండ్య సోదరుడు కృనాల్​ పాండ్య. సోదరుడి చేతుల మీదుగా క్యాప్​ను అందుకున్న కృనాల్​.. భావోద్వేగాన్ని నియంత్రించుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నాడు. అనంతరం జట్టు సభ్యులు అతనికి అభినందనలు తెలిపారు.

India vs England: Krunal Pandya in tears after getting his maiden ODI cap for India in 1st match in Pune
అరంగేట్రం సందర్భంగా భావోద్వేగానికి గురైన కృనాల్

By

Published : Mar 23, 2021, 10:35 PM IST

పుణె వేదికగా ఇంగ్లాండ్​తో తొలి మ్యాచ్​లో వన్డేల్లోకి అరంగేట్రం చేశాడు ముంబయి ఇండియన్స్​ ఆల్​రౌండర్​ కృనాల్ పాండ్యా. మ్యాచ్​కు ముందు అతని సోదరుడు హార్దిక్ పాండ్యా ఇచ్చిన క్యాప్​ను అందుకున్న కృనాల్​.. భావోద్వేగానికి లోనయ్యాడు. హార్దిక్​ భుజంపై తల పెట్టి ఆనందబాష్పాలు రాల్చాడు. తర్వాత జట్టు సభ్యులు అతనికి శుభాకాంక్షలు తెలిపారు.

ఇప్పటికే టీ20ల్లో టీమ్​ఇండియాకు ఆడిన కృనాల్.. తాజాగా 50 ఓవర్ల ఫార్మాట్​లోకి అడుగు పెట్టాడు. పొట్టి ఫార్మాట్​లో 18 మ్యాచ్​లు ఆడిన కృనాల్​.. 26 సగటుతో 121 పరుగులు సాధించాడు. గత ఐపీఎల్​తో పాటు ఈ ఏడాది జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో నిలకడగా రాణించిన పాండ్యను.. జాతీయ జట్టు తలుపుతట్టింది. హజారే టోర్నీలో 5 ఇన్నింగ్స్​ల్లో 388 పరుగులు చేశాడు.

వీరిద్దిరి తొలి మ్యాచ్​ సందర్భంగా బీసీసీఐ ట్వీట్టర్​ వేదికగా స్పందించింది. 'కృనాల్​ వన్డే అరంగేట్రం, ప్రసిద్ధ్ క్రిష్ణ అంతర్జాతీయ అరంగేట్రం' అని ట్వీట్​ చేసింది.

కోల్​కతా నైట్​ రైడర్స్​ ఫాస్ట్​ బౌలర్​ ప్రసిద్ధ్​ క్రిష్ణ గత నాలుగైదు ఏళ్ల నుంచి స్థిరమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. 2017-18 హజారే ట్రోఫీలో కర్ణాటక జట్టు ఫైనల్​ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. 2019-20 సీజన్​లోనూ 17 వికెట్లతో సత్తా చాటాడు.

ఇదీ చదవండి:ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: అగ్రస్థానానికి షెఫాలీ

ABOUT THE AUTHOR

...view details