భారత్-ఆస్ట్రేలియా మధ్య టెస్టు సిరీస్ త్వరలో ప్రారంభం కానుంది. ఇటీవల టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్లను విజయాల శాతం ఆధారంగా లెక్కించడం వల్ల ర్యాంకింగ్స్‌లో భారత్ రెండో స్థానానికి పడిపోయింది. ఆసీస్ అగ్రస్థానానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్ చేరాలంటే జరగబోయే సిరీస్ ఇద్దరికీ చాలా కీలకం. ఫలితంగా త్వరలో జరిగే టెస్టు సిరీస్‌పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే టెస్టు చరిత్రలో భారత జట్టుకు చెందిన కొన్ని రికార్డులు మరోసారి గుర్తుచేసుకుందాం.
అత్యధిక విజయాలు..
ఈ ఏడాది జూన్ నాటికి దాదాపు 542 టెస్టులు ఆడిన భారత జట్టు.. 157 గెలిచింది. 167 మ్యాచ్‌ల్లో ఓటమి పాలవగా.. 217 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. ఒకటి మాత్రం టై అయింది. ఇందులో ఎక్కువ విజయాలు ఆస్ట్రేలియాపైనే సాధించింది టీమ్ఇండియా. ఇప్పటివరకు కంగారూలపై 98 మ్యాచ్‌లు ఆడి, 28 గెలిచింది. అలానే ఎక్కువ మ్యాచ్‌ల్లోనూ ఇదే జట్టుపై టీమ్ఇండియా ఓడిపోయింది. మొత్తంగా 42 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది.
ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు..
ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు సాధించిన జట్లలో భారత్‌కు చోటుంది. 2004లో అస్ట్రేలియాతో జరిగిన టెస్టులో 7 వికెట్ల నష్టానికి 705 పరుగులు చేసింది. ఈ విభాగంలో నమోదైన టీమ్ఇండియా వ్యక్తిగత రికార్డుల్లో దీనికి నాలుగో స్థానం దక్కింది. ఇప్పటివరకు 759 పరుగులే భారత్ పేరిట ఉన్న అత్యధికం.
అత్యధిక పరుగుల ఛేదనలో..
అత్యధిక పరుగుల ఛేదనలో భారత్‌కు సరైన రికార్డు లేదు. 1978లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 493 పరుగులను ఛేదించే క్రమంలో 445 పరుగులకు ఆలౌటైంది. ఇప్పటివరకు భారత్ పేరిట ఉన్న అత్యధిక ఛేదన వెస్టిండీస్‌పై ఉంది. 1976లో కరీబియన్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 403 పరుగుల లక్ష్యాన్ని టీమ్ఇండియా పూర్తి చేసింది.
ఇన్నింగ్స్‌లో తక్కువ పరుగులు..
టెస్టు క్రికెట్లో ఒక ఇన్నింగ్స్‌లో తక్కువ పరుగులకే ఆలౌటైన జాబితాలోనూ భారత్ ఉంది. 1974లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులోని ఓ ఇన్నింగ్స్‌లో 42 పరుగులకే ఆలౌటైంది. ఇదే భారత్ ఖాతాలో అత్యల్ప స్కోరు. 1947లో జరిగిన టెస్టులో ఆస్ట్రేలియా చేతిలోనూ భారత బ్యాట్స్‌మన్ 58 పరుగులకే చేతులెత్తేశారు.
ప్రత్యర్థులను తక్కువకే..
ఒక ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థిని తక్కువ పరుగులకు కట్టడి చేయడంలో భారత్ ముందుంది. 2015లో జరిగిన ఓ మ్యాచ్‌లో 79 పరుగులకే దక్షిణాఫ్రికాను నిలువరించింది. 1981లో ఆస్ట్రేలియాను పరుగులకే ఆల్ట్ చేసింది.