తెలంగాణ

telangana

ETV Bharat / sports

సిడ్నీ టెస్టు: శుభ్​మన్​ గిల్​ అర్ధశతకం.. భారత్​ 96/2 - సిడ్నీ టెస్టు

ఆస్ట్రేలియా మధ్య జరుగుతోన్న మూడో టెస్టులో టీమ్ఇండియా నిలకడగా ఆడుతోంది. ప్రత్యర్థిపై ఆధిక్యాన్ని తెచ్చుకునే విధంగా భారత బ్యాట్స్​మెన్​ ప్రదర్శన చేశారు. యువ బ్యాట్స్​మన్​ శుభ్​మన్​ గిల్​ హాఫ్​ సెంచరీతో అలరించగా.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయిన టీమ్ఇండియా 96 పరుగులు చేసింది.

India vs Australia Sydney test: India trail by 242 runs
సిడ్నీ టెస్టు: రెండో ఆట ముగిసే సమయానికి భారత్​ 96/2

By

Published : Jan 8, 2021, 1:09 PM IST

సిడ్నీ వేదికగా జరుగుతోన్న మూడో టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయిన టీమ్ఇండియా.. 96 పరుగులు చేసింది. ఓపెనర్​ శుభ్​మన్​ గిల్​ (50) అర్ధశతకంతో అలరించగా.. 26 పరుగులకే రోహిత్​శర్మ వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజ్​లో ఛెతేశ్వర్​ పుజారా (9), కెప్టెన్​ అజింక్య రహానె (5) ఉన్నారు. భారత జట్టుపై ఆస్ట్రేలియా మరో 242 రన్స్​ ఆధిక్యంలో ఉంది.

అంతకుముందు ఆస్ట్రేలియా 338 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్‌స్మిత్‌ (131) టెస్టుల్లో 27వ శతకం సాధించాడు. శుక్రవారం 166/2 ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా మరో 172 పరుగులు చేసి మిగతా 8 వికెట్లు కోల్పోయింది. స్మిత్‌, లబుషేన్‌(91) బాధ్యతాయుతంగా ఆడారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 100 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. ఆపై మిగతా బ్యాట్స్‌మెన్‌ విఫలమవడం వల్ల ఆతిథ్య జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 338 పరుగులకు కుప్పకూలిపోయింది.

ABOUT THE AUTHOR

...view details