కరోనా ప్రభావం వల్ల క్రీడా టోర్నీల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. వైరస్ ఎప్పుడు అదుపులోకి వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే జరగాల్సిన పలు క్రికెట్ సిరీస్‌లు రద్దవగా, జరగబోయేవి వాయిదా పడుతున్నాయి. అయితే ఈ ఏడాది చివర్లో జరగాల్సిన భారత్-ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ మాత్రం యాథావిథిగా జరుగుతుందని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తెలిపింది. అయితే ఈ మ్యాచ్‌లను ఖాళీ మైదానాల్లో నిర్వాహిస్తామని స్పష్టం చేసింది.
ఖాళీ మైదానాల్లో భారత్- ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ - CA CEO Kevin Roberts about India vs Australia test series
ఈ ఏడాది చివర్లో జరగబోయే భారత్-ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌ను ఖాళీ మైదానాల్లో నిర్వహిస్తామని క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ కెవిన్ రాబర్ట్స్ వెల్లడించారు. నాలుగు టెస్టులకు బదులు ఐదు టెస్టుల సిరీస్‌పై ఆలోచిస్తున్నామని అన్నారు.
భారత్
"ప్రస్తుతం కరోనాతో ప్రపంచం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. అయితే భారత్‌తో జరగబోయే సిరీస్ ద్వారా క్రికెట్ ప్రపంచానికి ఓ సానుకూల వాతావరణం కల్పించాలనుకుంటున్నాం. మైదానంలోకి ప్రేక్షకులు వచ్చినా రాకపోయినా సిరీస్ మాత్రం జరుగుతుంది. ఇప్పటికే బీసీసీఐ, భారత క్రికెటర్లు, జట్టు సహాయ సిబ్బంది అంతా ఆశావహంగా ఉన్నారు. బీసీసీఐతో సంప్రదింపులు జరుపుతున్నాం. నాలుగు బదులు ఐదు టెస్టుల సిరీస్‌పైనా చర్చించాం"
-కెవిన్ రాబర్ట్స్, క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్