వాంఖడే వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత ఓపెనర్ శిఖర్ ధావన్ అర్ధశతకం నమోదు చేశాడు. నిన్నటి వరకు జట్టులో ధావన్ స్థానంపై స్పష్టతలేదు. కానీ సారథి విరాట్ కోహ్లి తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ముందుకు సాగుతున్నాడు. ధావన్ హాప్ సెంచరీతో (55*) 20ఓవర్లకు భారత్ 100 పరుగులు చేసింది.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 10 పరుగులే చేసి స్టార్క్ బౌలింగ్లో వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రాహుల్(31*)తో విలువైన భాగస్వామ్యం నమోదు చేసి జట్టు స్కోరును ముందుకు నడిపిస్తున్నాడు ధావన్.