దక్షిణాఫ్రికా వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న అండర్ 19 ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో.. భారత్ ఫర్వాలేదనిపించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన యువ భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది.
యశస్వి మరోసారి...
టోర్నీలో నిలకడగా రాణిస్తున్న భారత ఆశాకిరణం యశస్వి జైస్వాల్ మరోసారి సత్తా చాటాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగి 62 పరుగులు( 82 బంతుల్లో ; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) సాధించాడు. మిగిలిన బ్యాట్స్మన్లలో సక్సేనా(14), తిలక్ వర్మ(2), ప్రియమ్ గార్గ్(5), ధ్రువ్ జురెల్(15) నిరాశపర్చారు.
ఆదుకున్న అథర్వ...
144 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన భారత జట్టును.. నామమాత్రపు స్కోరుకు తీసుకెళ్లడంలో ఆల్‌రౌండర్ అథర్వ కీలకంగా ఉపయోగపడ్డాడు. మరో ఎండ్‌లో బౌలర్లు బిష్ణోయ్(30) సహకారంతో అర్ధశతకం చేశాడు. అథర్వ 55 పరుగులు (54 బంతుల్లో ; 5 ఫోర్లు, 1 సిక్సర్) సాధించి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు.
యువ టీమిండియాలో బిష్ణోయ్, కార్తీక్ త్యాగి, ఆకాశ్‌సింగ్, అథర్వలతో బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉంది. వీరు రాణిస్తే భారత్ ప్రపంచకప్ రేసులో ఉంటుంది. లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ను భారత్ ప్రధానాస్త్రంగా ప్రయోగించనుంది. ఇప్పటిదాకా బిష్టోయ్ 3 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు తీసి ప్రపంచకప్‌లో ప్రభావవంతమైన బౌలర్‌గా ఎదిగాడు.