తెలంగాణ

telangana

ETV Bharat / sports

అడిలైడ్ వేదికగా భారత్-ఆసీస్ డేనైట్ టెస్టు! - భారత్-ఆస్ట్రేలియా పర్యటన

ఆస్ట్రేలియా పర్యటనలో టీమ్​ఇండియా డేనైట్ టెస్టు ఆడేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈ టెస్టు అడిలైడ్ వేదికగా జరగబోతుందని తెలుస్తోంది.

పింక్
పింక్

By

Published : May 27, 2020, 7:58 PM IST

డిసెంబర్​లో ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టు మ్యాచ్​ల సిరీస్ ఆడనుంది భారత్. అయితే ఇందులో ఒకటి డే/నైట్ మ్యాచ్. అడిలైడ్ వేదికగా ఈ మ్యాచ్ జరుగబోతుందని తెలుస్తోంది. ఇదే జరిగితే విదేశీ గడ్డపై భారత్​కు ఇది తొలి పింక్ బాల్ టెస్టు అవుతుంది.

డిసెంబర్​ 3న బ్రిస్బేన్ వేదికగా జరిగే మొదటి టెస్టుతో సిరీస్ ప్రారంభం కానుందని సమాచారం. చివరి రెండు మ్యాచ్​లు మెల్​బోర్న్, సిడ్నీలలో జరుగుతాయని తెలుస్తోంది. అయితే ఈ మ్యాచ్​లకు ప్రేక్షకులను అనుమతిస్తారా లేదా అనే విషయంపై మాత్రం ఇంకా స్పష్టత లేదు.

2018-19 పర్యటనలోనే భారత్ డేనైట్ టెస్టు ఆడాల్సి ఉన్నా అది వీలుపడలేదు. ఇటీవలే బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీతో పాటు టీమ్​ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఆస్ట్రేలియాలో పింక్ టెస్టు ఆడేందుకు సుముఖత వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details