తెలంగాణ

telangana

ETV Bharat / sports

'మా సత్తా ఏంటో అప్పుడు చూపిస్తాం' - భారత్

రాంచీ వన్డేలో బ్యాట్స్​మెన్ విఫలమయినప్పటికీ చివరి రెండు మ్యాచ్​ల్లో పుంజుకుంటామని కోహ్లీ ధీమా వ్యక్తంచేశాడు.

కోహ్లీ

By

Published : Mar 9, 2019, 12:44 PM IST

రాంచీలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో భారత్ పరాజయం పాలైంది. విరాట్ మినహా బ్యాట్స్​మెన్ అందరూ విఫలమయ్యారు. ఈ విషయమై కోహ్లీ స్పందిస్తూ చివరి రెండు వన్డేల్లో బ్యాటింగ్​పై దృష్టిపెడతామని తెలిపాడు.

314 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 27 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కోహ్లీ ఒంటరి పోరాటంతో శతకం సాధించాడు. మిగిలిన రెండు వన్డేలకు రిజర్వ్ బెంచ్​కు అవకాశం ఇవ్వొచ్చని తెలిపాడు విరాట్.

భారత్​ టాప్​ఆర్డర్ బలంగా ఉంది. కీలక భాగస్వామ్యాలు నెలకొల్పడంలో ఆటగాళ్లు కృషి చేస్తున్నారు. గత రెండు మ్యాచ్​ల్లో వికెట్లు త్వరగా కోల్పోయాం. ఈ విషయంపై దృష్టి సారించాం. మరోసారి అలా జరగకుండా జాగ్రత్తపడతాం.
--విరాట్ కోహ్లీ, భారత జట్టు కెప్టెన్

బౌలర్లు మంచి ప్రదర్శన కనబర్చారని కోహ్లీ కితాబిచ్చాడు. ఓ దశలో 350 పరుగులకుపైగా ఛేదన చేయాల్సి వస్తుందనుకున్నామని.. కట్టుదిట్టమైన బౌలింగ్​తో పరుగులకు అడ్డుకట్ట వేశామని తెలిపాడు. ఫించ్, ఖవాజా అద్భుతంగా ఆడారని ప్రశంసించాడు.

300 పరుగులు చేస్తే చాలనుకున్నాం. ఖవాజా, మాక్స్​వెల్, రిచర్డ్​సన్ చాలా బాగా ఆడారు. మిగతా వన్డేల్లోనూ ఇదే ప్రదర్శన కొనసాగించాలనుకుంటున్నాం.
--ఫించ్, ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్

ABOUT THE AUTHOR

...view details