విశాఖపట్నం వేదికగా జరుగుతున్న తొలిటెస్టులో భారత్ పూర్తి ఆధిపత్యం కొనసాగిస్తోంది. రెండో రోజు టీ విరామ సమయానికి 5 వికెట్ల నష్టానికి 450 పరుగులు చేసింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్.. చూడచక్కని షాట్లతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే టెస్టుల్లో తొలి డబుల్ సెంచరీ సాధించాడు. అనంతరం 215 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ 176 పరుగులు చేసి ఔటయ్యాడు.
టీ విరామ సమయానికి భారత్ 450/5 - విశాఖపట్నం తొలి టెస్టు
తొలిటెస్టులో రెండో రోజు టీ విరామ సమయానికి 450 పరుగులు చేసింది టీమిండియా. మయాంక్ అగర్వాల్ ద్విశతకంతో రాణించాడు.
టీ విరామ సమయానికి భారత్ 450/5
కెప్టెన్ విరాట్ కోహ్లీ కేవలం 20 పరుగులు చేసి, అరంగేట్ర ముత్తుస్వామి బౌలింగ్లో వెనుదిరిగాడు. చెతేశ్వర్ పుజారా 6 పరుగులకే ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో రవీంద్ర జడేజా, హనుమ విహారి ఉన్నారు. సఫారీ బౌలర్లలో కేశవ్ మహారాజ్ 2 వికెట్లు తీయగా, ఫిలాండరర్, ముత్తుస్వామి, ఎల్గర్ తలో వికెట్ దక్కించుకున్నారు.