తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత్ ఘోర పరాజయం

టాప్​ ఆర్డ్​ర్ విఫలమైన వేళ భారత్  41 పరుగుల తేడాతో ఘోరపరాజయం చవిచూసింది.

భారత మహిళల జట్టు ఓటమి

By

Published : Mar 4, 2019, 2:05 PM IST

Updated : Mar 5, 2019, 12:40 AM IST

భారత్​- ఇంగ్లండ్​ మధ్య జరుగుతున్న మహిళల తొలి టీ 20లో టీమిండియా పరాజయం పాలైంది. ఆలౌరౌండ్​ ప్రదర్శనతో అద్భుతంగా ఆడిన ఇంగ్లండ్ జట్టు 41 పరుగుల తేడాతో గెలిచింది.

161 పరుగుల లక్ష్యఛేదనలో బరిలోకి దిగిన స్మృతిసేన 119 పరుగులే చేసింది. 46 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఇంగ్లండ్ చేతిలో ఓటమి చవిచూసింది. ఇంగ్లీష్ బౌలర్లలో కేథరిన్ బ్రంట్, స్మిత్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.

కెప్టెన్ స్మృతి మంధానా(2) విఫలమైన వేళ మిగతా బ్యాట్స్​ఉమెన్ వరుసగా పెవిలియన్​కు క్యూ కట్టారు. మిథాలి రాజ్(7)​ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయకపోగా... భారత్​ ఓటమి ముందుగానే ఖారరైంది. భారత బ్యాట్​ఉమెన్​లో శికా పాండే(23), దీప్తిశర్మ(22) అత్యధిక స్కోరు నమోదు చేశారు.

ఇంతకుముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 160 పరుగులు చేసింది. ఓపెనర్​ బేమాంట్(62) అర్థశతకంతో అదరగొట్టగా, మరో ఓపెనర్ వ్యాట్(35) రాణించింది. తొలి 10 ఓవర్లలోనే ఈ జోడీ 80 పరుగులు చేసి శుభారంభాన్నిచ్చింది.

చివర్లో కెప్టెన్ హెథర్ నైట్(20) ధాటిగా జట్టుకు భారీ స్కోరు అందించింది. అరుంధతి రెడ్డి వేసిన 18వ ఓవర్లో వరుసగా 5 ఫోర్లు కొట్టి చివర్లో మెరుపులు మెరిపించింది హెథర్. 20 బంతుల్లో 40 పరుగులు చేసి దీప్తి శర్మ బౌలింగ్​లో ఔటైంది. చివరి మూడు ఓవర్లలో 37 పరుగులు రాబట్టుకుంది ఇంగ్లీష్ జట్టు. భారత బౌలర్లలో రాధ యాదవ్ రెండు వికెట్లు తీసింది.

భారత్​ లక్ష్యం 161

Last Updated : Mar 5, 2019, 12:40 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details