అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ).. శుక్రవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్లో భారత్కు షాక్ తగిలింది. 2016 నుంచి టెస్టుల్లో అగ్రస్థానంలో కొనసాగుతున్న వస్తున్న మెన్ ఇన్ బ్లూ.. ఇప్పుడు దానిని కోల్పోయింది. ప్రస్తుతం ఈ జాబితాలో టాప్లో ఆస్ట్రేలియా(116).. ఆ తర్వాత న్యూజిలాండ్(115), టీమిండియా(114) ఉన్నాయి.
టెస్టుల్లో అగ్రస్థానం కోల్పోయిన టీమిండియా
కొన్నేళ్లుగా టెస్టుల్లో అగ్రస్థానంలో కొనసాగుతూ వస్తున్న భారత్.. తాజా ర్యాంకింగ్స్లో దిగువకు పడిపోయింది. ఇదే సమయంలో ఆస్ట్రేలియా.. టెస్టుల్లో, టీ20ల్లో టాప్ ప్లేస్కు దూసుకొచ్చింది.
టీమిండియా టెస్టు జట్టు
అయితే ఆసీస్.. టెస్టుల్లో మాత్రమే కాకుండా టీ20ల్లో నంబర్.1 ర్యాంక్ కొట్టేసింది. గతేడాది ప్రపంచకప్ నెగ్గిన ఇంగ్లాండ్.. వన్డేల్లో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
ర్యాంక్ | టెస్టు జట్టు | పాయింట్లు |
1 | ఆస్ట్రేలియా | 116 |
2 | న్యూజిలాండ్ | 115 |
3 | టీమిండియా | 114 |
4 | ఇంగ్లాండ్ | 105 |
5 | శ్రీలంక | 91 |
6 | దక్షిణాఫ్రికా | 90 |
7 | పాకిస్థాన్ | 86 |
8 | వెస్టిండీస్ | 79 |
ర్యాంక్ | వన్డే జట్టు | పాయింట్లు |
1 | ఇంగ్లాండ్ | 127 |
2 | టీమిండియా | 119 |
3 | న్యూజిలాండ్ | 116 |
4 | దక్షిణాఫ్రికా | 108 |
5 | ఆస్ట్రేలియా | 107 |
6 | పాకిస్థాన్ | 102 |
7 | బంగ్లాదేశ్ | 88 |
8 | శ్రీలంక | 85 |
ర్యాంక్ | టీ20 జట్టు | పాయింట్లు |
1 | ఆస్ట్రేలియా | 278 |
2 | ఇంగ్లాండ్ | 268 |
3 | టీమిండియా | 266 |
4 | పాకిస్థాన్ | 260 |
5 | దక్షిణాఫ్రికా | 258 |
6 | న్యూజిలాండ్ | 242 |
7 | బంగ్లాదేశ్ | 229 |
8 | వెస్టిండీస్ | 229 |
Last Updated : May 1, 2020, 1:47 PM IST