తెలంగాణ

telangana

ETV Bharat / sports

టీమిండియా-బంగ్లాదేశ్: భారత్ లక్ష్యం 154 - భారత్-బంగ్లాదేశ్​ రెండో టీ20

రెండో టీ20లో టీమిండియాకు 154 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది బంగ్లాదేశ్. ఈ సిరీస్​ ఓడిపోకూడదు అనుకుంటే భారత్ కచ్చితంగా ఈ మ్యాచ్​ గెలిచి తీరాలి.

భారత్-బంగ్లాదేశ్​ రెండో టీ20

By

Published : Nov 7, 2019, 8:49 PM IST

రాజ్​కోట్ వేదికగా భారత్-బంగ్లాదేశ్​ మధ్య రెండో టీ20 జరుగుతోంది. తొలుత బ్యాటింగ్​ చేసిన బంగ్లా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది.

ప్రారంభంలో ధాటిగా ఆడిన పర్యటక జట్టు.. ఆ తర్వాత తడబడింది. వికెట్లు కోల్పోవడం వల్ల అనుకున్నంత మేర స్కోరు చేయలేకపోయింది.

బంగ్లా బ్యాట్స్​మెన్​లో లిట్టన్ దాస్ 29, మహ్మద్ నయీమ్ 36, సౌమ్య సర్కార్ 30, ముష్ఫీకర్ రహీమ్ 4, ఆఫిప్ హుస్సేన్ 6, మహ్మదుల్లా 30, మొసద్దెక్ హుస్సేన్ 7, అమినుల్ ఇస్లామ్ 5 పరుగులు చేశారు.

వికెట్ తీసిన ఆనందంలో చాహల్

భారత బౌలర్లలో చాహల్ రెండు వికెట్లు తీశాడు. ఖలీల్​ అహ్మద్, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్ తలో వికెట్ దక్కించుకున్నారు.

ఇది చదవండి: పొట్టి ఫార్మాట్​లో రోహిత్ శర్మ 'సెంచరీ'

ABOUT THE AUTHOR

...view details