తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత్​-బంగ్లా: రెండో టీ20కి తుపాను ముప్పు తప్పదా..! - తుపాను ప్రభావం

రాజ్‌కోట్‌ వేదికగా జరగనున్న భారత్​-బంగ్లాదేశ్ టీ20 మ్యాచ్​కు తుపాను ముప్పు ఉన్నట్లు వాతావరణ విభాగం తెలిపింది. నవంబర్​ 7న(గురువారం)ఇరు జట్లు తలపడనున్నాయి.

భారత్​-బంగ్లా: రెండో టీ20కి తుపాను ముప్పు తప్పదా..!

By

Published : Nov 4, 2019, 9:31 PM IST

దిల్లీ వేదికగా భారత్‌-బంగ్లా మధ్య మొదటి టీ20 మ్యాచ్​కు కాలుష్యం ఇబ్బంది పెట్టగా... రెండో టీ20కి తుపాను ముప్పు పొంచి ఉంది. వర్షం పడే సూచనలు ఉండటం వల్ల మ్యాచ్‌ జరిగే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నెల 7న గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో మ్యాచ్‌ జరగాల్సి ఉంది. ఇప్పటికే తొలి పోరులో ఓటమిపాలైన టీమిండియా.. రెండోదైనా గెలిచి సిరీస్‌ను 1-1తో సమం చేయాలని పట్టుదలతో ఉంది.

'మహా' ముంచుకొస్తోంది...

ప్రస్తుతం అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. అది ఒమన్‌ వైపు పయనిస్తోంది. ఏ క్షణంలోనైనా దిశ మార్చుకొనే అవకాశం ఉండటం వల్ల... పశ్చిమ గుజరాత్‌, సౌరాష్ట్ర ప్రాంతాలపై ప్రభావం ఉంటుందట. ఇప్పటికే వాతావరణ శాఖ తుపాను హెచ్చరికలు జారీ చేసింది. జాలర్లు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని సూచించింది. తుపానుకు 'మహా' అని పేరు పెట్టారు.

భారత్​-బంగ్లా: రెండో టీ20కి తుపాను ముప్పు తప్పదా..!

మ్యాచ్‌కు ముందు రోజు నుంచి గుజరాత్‌, సౌరాష్ట్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ ప్రకృతి విపత్తును ఎదుర్కొనేందుకు ప్రజలు, అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించింది. డయూకు నైరుతి దిశలో అరేబియా సముద్రంలో 580 కిలోమీటర్ల దూరంలో అల్పపీడనం ఏర్పడింది. చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ ప్రాంతీయ సంచాలకుడు జయంత్‌ సర్కార్‌ తెలిపారు. తుపాను ఉద్ధృతమైతే రెండో టీ20 రద్దైనా ఆశ్చర్యం లేదని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details