తెలంగాణ

telangana

తొలి టీ20లో భారత్​పై బంగ్లా విజయం

By

Published : Nov 3, 2019, 10:32 PM IST

Updated : Nov 3, 2019, 11:27 PM IST

దిల్లీ వేదికగా భారత్​తో జరిగిన తొలి టీ20లో బంగ్లాదేశ్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 149 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. బంగ్లా బ్యాట్స్​మెన్ ముష్ఫీకర్ రహీమ్(60) అర్థశతకంతో ఆకట్టుకుని మ్యాచ్​ను గెలిపించాడు.

భారత్ - బంగ్లాదేశ్​

భారత్​తో జరిగిన తొలి టీ20లో విజయం బంగ్లాదేశ్​నే వరించింది. 149 పరుగుల లక్ష్యాన్ని మూడు వికెట్లు కోల్పోయి చేధించింది. బంగ్లా బ్యాట్స్​మెన్ ముష్ఫీకర్ రహీమ్(60) అర్ధశతకంతో చెలరేగి మ్యాచ్​ను గెలిపించాడు. మరో ఆటగాడు సౌమ్యా సర్కార్ 39 పరుగులతో ఆకట్టుకున్నాడు. భారత బౌలర్లు దీపక్ చాహర్, ఖలీల్ అహ్మద్, యజువేంద్ర చాహల్ తలో వికెట్ తీసుకున్నారు. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్​ 1-0 తేడాతో ముందంజలో ఉంది బంగ్లా. టీ20ల్లో భారత్​పై గెలవడం బంగ్లాకు ఇదే తొలిసారి.

149 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలో దిగిన బంగ్లాదేశ్ ఆరంభంలోనే లిటన్ దాస్(7) వికెట్ కోల్పోయింది. అనంతరం మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు నయీమ్(26), సౌమ్యా సర్కార్(39). నిలకడగా ఆడుతున్న నయీమ్​ను ఔట్ చేశాడు చాహల్. తర్వాత బ్యాటింగ్​కు వచ్చిన ముష్ఫీకర్ రహీమ్.. సౌమ్యా సర్కార్ సాయంతో చెలరేగాడు. ఆరంభంలో నిదానంగా ఆడినా.. అనంతరం బ్యాట్ ఝుళిపించాడు.

మలుపు తిప్పిన ఓవర్​..

18వ ఓవర్​ వరకు ఇరు జట్ల మధ్య మ్యాచ్ హోరాహోరీగా సాగింది. 2 ఓవర్లో 21 పరుగులు చేయాల్సిన తరుణంలో ఖలీల్ అహ్మద్ వేసిన 19వ ఓవర్​లో 18 పరుగులు రాబట్టింది బంగ్లాదేశ్. ముష్ఫీకర్ 4 బౌండరీలతో జట్టు విజయాన్ని ఖాయం చేశాడు. చివరి ఓవర్​కు 4 పరుగులే అవసరం కాగా మ్యాచ్​ను సిక్సర్​తో ముగించాడు కెప్టెన్​ మహ్మదుల్లా(15).

భారత్ 6 వికెట్లు నష్టానికి 148 పరుగులు చేసింది. బౌలింగ్​కు అనుకూలిస్తున్న పిచ్​పై శిఖర్ ధావన్(41) మినహా మిగతా బ్యాట్స్​మెన్​ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. బంగ్లా బౌలర్లలో అమినుల్ హసన్, షఫియిల్ ఇస్లాం చెరో రెండు వికెట్లు తీయగా.. ఆఫిఫ్ హొస్సేన్ ఓ వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.

శిఖర్ ధావన్

ఇదీ చదవండి: 9 పరుగులకే ఔటైనా... ధోనీ, కోహ్లీ రికార్డులు బ్రేక్

Last Updated : Nov 3, 2019, 11:27 PM IST

ABOUT THE AUTHOR

...view details