ఆస్ట్రేలియా-ఎ, భారత్-ఎ జట్ల మధ్య జరుగుతోన్న మూడు రోజుల వార్మప్ మ్యాచ్‌లో రెండో రోజు ముగిసేసరికి 39 పరుగుల తేడాతో ఆసీస్ పైచేయి సాధించింది. కామెరూన్ గ్రీన్ (114*) శతకంతో అజేయంగా నిలిచాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు ఎనిమిది వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసింది. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్(3), మహ్మద్ సిరాజ్, రవిచంద్రన్ అశ్విన్ చెరో రెండు వికెట్లు తీశారు.
మెరిసిన గ్రీన్.. భారత్‌పై ఆసీస్ పైచేయి
మూడు రోజుల వార్మప్ మ్యాచ్‌లో భాగంగా రెండో రోజు ఆట ముగిసేసరికి భారత్-ఎ జట్టుపై 39 పరుగుల తేడాతో ఆసీస్ ఆధిక్యంలో నిలిచింది. ప్రస్తుతానికి మొదటి ఇన్నింగ్స్‌లో ఎనిమిది వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసింది కంగారూ జట్టు. కామెరూన్ గ్రీన్ శతకంతో మెరిశాడు.
ఆసీస్
టీమ్ఇండియా తొలి రోజు ఎనిమిది వికెట్లు కోల్పోయి 237 పరుగులు చేసింది. కెప్టెన్ అజింక్యా రహానె (117*) శతకంతో సత్తాచాటగా, పుజారా (54) అర్ధశతకం సాధించాడు. కాగా, మిగిలిన బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. రెండో రోజు మరో పది పరుగులు జోడించి 247 వద్ద డిక్లేర్ చేసింది భారత్. ఆసీస్ బౌలర్లలో జేమ్స్ ప్యాటిన్సన్(3), హెడ్(2), నాసర్(2), బిర్డ్, స్టెకేట్ చెరో వికెట్ పడగొట్టారు.