తెలంగాణ

telangana

ETV Bharat / sports

పొట్టి ఫార్మట్​లో విరాట్​-రోహిత్​ మధ్య పోటీ - పొట్టి ఫార్మట్​లో విరాట్​-రోహిత్​ మధ్య పోటీ

ప్రపంచ క్రికెట్​లో అత్యుత్తమ బ్యాట్స్​మెన్​లో విరాట్​ కోహ్లీ, రోహిత్​ శర్మ కచ్చితంగా ఉంటారు. అలాంటి వీరిద్దరూ ఓ రికార్డు కోసం చాలా రోజులుగా పోటీ పడుతున్నారు. అదేంటంటే?

పొట్టి ఫార్మట్​లో విరాట్​-రోహిత్​ మధ్య పోటీ
విరాట్​-రోహిత్

By

Published : Dec 6, 2019, 6:31 AM IST

ప్రస్తుతం టీమిండియాలో దూకుడు ప్రదర్శిస్తున్న క్రికెటర్లు కెప్టెన్ విరాట్‌ కోహ్లీ, ఓపెనర్​ రోహిత్‌ శర్మ. అంతర్జాతీయ క్రికెట్‌లో పరుగుల మోత మోగిస్తున్నవీరిద్దరూ పలు రికార్డులు కైవసం చేసుకుంటున్నారు. అయితే వీరిద్దరి మధ్య ఓ ఆసక్తికర పోరుకు విండీస్‌-భారత్‌ టీ20 సిరీస్‌ వేదిక కానుంది.

టాప్​ ప్లేస్ ఎవరి సొంతం?

అంతర్జాతీయ టీ20లో భారత బ్యాట్స్​మెన్ హవా కొనసాగుతోంది. 2007లో పొట్టి ఫార్మాట్​లో అడుగుపెట్టిన రోహిత్​శర్మ.. అత్యధిక పరుగుల చేసిన వారిలోప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు 92 ఇన్నింగ్స్​లు​(100 మ్యాచ్​లు) ఆడి 2,537 పరుగులు చేశాడు.

2010లో టీ20ల్లోకి ఎంట్రీ ఇచ్చిన విరాట్​... 67 ఇన్నింగ్స్​ల్లో​(71 మ్యాచ్​లు) 2,450 పరుగులు​ చేసి రెండో స్థానంలో ఉన్నాడు. వీరిద్దరి మధ్య 87 పరుగుల అంతరమే ఉంది.

ఈ ఏడాది చివరి మూడు మ్యాచ్​లు టీ20 సిరీస్​ను విండీస్​తో ఆడనుంది టీమిండియా.ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు బ్యాట్స్​మెన్ స్థానాలు మారుతాయా? అలానే ఉంటాయా? అనేది చూడాలి. ఈ జాబితాలో మూడో స్థానంలో న్యూజిలాండ్‌ క్రికెటర్‌ మార్టిన్‌ గప్టిల్‌(2386) ఉన్నాడు.

అర్ధశతకాల్లోనూ...

అంతర్జాతీయ టీ20ల్లో ఎక్కువ సార్లు 50కి పైగా పరుగులు చేసిన వారి జాబితాలో రోహిత్‌-కోహ్లీలు పోటీపడుతున్నారు. వీరిద్దరూ 22 సార్లు యాభైకి పైగా పరుగులు చేసి, సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. ఇందులో రోహిత్‌ శర్మ 18 అర్ధ శతకాలు, 4 సెంచరీలతో 22సార్లు యాభైకి పైగా పరుగుల్ని సాధించాడు. కోహ్లీ.. 22 హాఫ్‌ సెంచరీలు నమోదు చేశాడు. వీరిద్దరి తర్వాత మార్టిన్‌ గప్టిల్‌(17) మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.

ABOUT THE AUTHOR

...view details