కెరీర్లోనే తొలిసారిగా వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ.. తిరిగి గాడిలో పడ్డాడు. అయితే ఫామ్‌ను తిరిగి అందుకోవడంపై స్పందించాడు కోహ్లీ. ఈ విషయంలో తన భార్య అనుష్క శర్మ, ఐపీఎల్ జట్టు సభ్యుడు ఏబీ డివిలియర్స్ తనకు సలహాలు ఇచ్చారని పేర్కొన్నాడు.
క్రికెట్లోని ప్రాథమిక అంశాలపై దృష్టి పెట్టాను. టీమ్ఇండియాకు ఆడటంపై ఎల్లప్పుడూ గర్వపడతాను. బంతిపై దృష్టి సారించాలని నా భార్య నాకు చెప్పింది. ఆటకు ముందు ఐపీఎల్ సహచరుడు డివిలియర్స్‌తో ప్రత్యేకంగా చాట్ చేశాను. అతడు కూడా బంతిని సరిగా అంచనా వేయాలని సూచించాడు. సరిగ్గా అదే పని చేశాను. సత్ఫలితం పొందాను.