పుణె వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో ఇంగ్లాండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ ఓ రికార్డు నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీని ఔట్ చేసిన ఆదిల్.. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటి వరకు 9 సార్లు అతడి వికెట్‌ను తీశాడు. ఈ ఘనత సాధించిన బౌలర్ల జాబితాలో రషీద్ రెండో స్థానంలో నిలిచాడు.
తొమ్మిదోసారి కోహ్లీని ఔట్ చేసిన రషీద్ - tim southee
ఇంగ్లాండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ కొత్త రికార్డు నమోదు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో.. విరాట్ కోహ్లీని అత్యధిక సార్లు ఔట్ చేసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఇప్పటి వరకు విరాట్‌ను 9 సార్లు పెవిలియన్ చేర్చాడు.
9 సార్లు కోహ్లీని ఔట్ చేసిన బౌలర్‌గా రషీద్ రికార్డు
విరాట్‌ను అత్యధిక సార్లు పెవిలియన్ చేర్చిన బౌలర్లలో కివీస్ క్రికెటర్ టిమ్ సౌథీ అగ్రస్థానంలో ఉన్నాడు. అతడు 10 సార్లు కోహ్లీని పెవిలియన్ చేర్చాడు. ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ అండర్సన్, గ్రేమ్ స్వాన్లు 8 సార్లు విరాట్ వికెట్ దక్కించుకున్నారు. ఇటీవల ముగిసిన టీ20 సిరీస్‌లోనూ విరాట్ వికెట్‌ను రెండు సార్లు తీశాడు ఆదిల్ రషీద్.
Last Updated : Mar 26, 2021, 8:00 PM IST