బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు ముందు సారథి రోహిత్‌శర్మ గాయపడినట్లు తెలుస్తోంది. నేడు ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో ప్రాక్టీసు చేస్తుండగా... ఎడమ తొడ భాగంలో బంతి గట్టిగా తాకినట్లు సమాచారం. వెంటనే అతడికి విశ్రాంతినిచ్చింది యాజమాన్యం. ఆదివారం జరగనున్న మ్యాచ్‌కు పూర్తిగా కోలుకుంటాడని భావిస్తోంది. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రానుంది.
బంగ్లాతో టీ20 ముందు రోహిత్‌శర్మకు గాయం..! - బంగ్లాతో టీ20 ముందు రోహిత్‌శర్మకు గాయం
బంగ్లాతో టీ20 సిరీస్‌కు సిద్ధమౌతున్న టీమిండియాకు షాక్ తగిలింది. నేడు దిల్లీలోని ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో ప్రాక్టీసులో పాల్గొన్న హిట్‌మ్యాన్ ఎడమ తొడకు బంతి తగిలి గాయమైనట్లు సమాచారం.
బంగ్లాతో టీ20 ముందు రోహిత్‌శర్మకు గాయం..!
ఈ టీ20 సిరీస్‌కు విరాట్ కోహ్లీకి విశ్రాంతి నిచ్చిన యాజమాన్యం... రోహిత్‌కు కెప్టెన్సీని అప్పగించింది. ప్రాక్టీసు సెషన్లో రిషబ్ పంత్ కీపింగ్ చేయగా.. సంజూ శాంసన్ ఫీల్డర్‌గానే కనిపించాడు. ఆల్‌రౌండర్ శివమ్ ధూబే నెట్స్‌లో శ్రమిస్తూ కనిపించాడు.
TAGGED:
రోహిత్‌శర్మ