కొన్ని రోజుల ఉత్కంఠ తర్వాత టీమ్ఇండియా వైస్ కెప్టెన్ రోహిత్‌శర్మ.. ఆస్ట్రేలియాకు పయనమయ్యాడు. గాయం కారణంగా ఆసీస్‌తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌కు దూరమైన హిట్‌మ్యాన్.. ఇటీవలే తన ఫిట్‌నెస్ నిరూపించుకుని కంగారూలతో టెస్టు సిరీస్‌కు సిద్ధమయ్యాడు. అడిలైడ్ వేదికగా జరగబోయే మూడో టెస్టులో పాల్గొనేందుకు మంగళవారం ఉదయం విమానం ఎక్కిన హిట్‌మ్యాన్.. దుబాయ్ మీదుగా ఆస్ట్రేలియా చేరుకోనున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
గత శుక్రవారం ఎన్‌సీఏలో నిర్వహించిన ఫిట్‌నెస్ టెస్టులో రోహిత్ పాసయ్యాడని బీసీసీఐ ప్రకటించింది. ఫలితంగా రోహిత్ ఆస్ట్రేలియాకు బయల్దేరి వెళ్తాడని ఇదివరకే తెలిపింది. అక్కడ 14 రోజుల క్వారంటైన్ తర్వాత జట్టు సభ్యులతో రోహిత్ కలవనున్నాడు. దీంతో ఆసీస్‌తో జరగనున్న తొలి రెండు టెస్టులకు దూరం కానున్నాడు. జనవరి 7న సిడ్నీలో ప్రారంభమయ్యే మూడో టెస్టు సమయానికి రోహిత్ టీమ్‌కు అందుబాటులో ఉంటాడు.