తెలంగాణ

telangana

ETV Bharat / sports

బ్రిస్బేన్​ టెస్టు: గాయంతో మైదానాన్ని వీడిన సైనీ - బ్రిస్బేన్​ టెస్టు

ఆస్ట్రేలియా పర్యటనలో టీమ్ఇండియాను గాయాలబెడద ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. బ్రిస్బేన్​ వేదికగా జరుగుతోన్న నాలుగో టెస్టులో భారత బౌలర్​ నవదీప్​ సైనీ గాయపడి మైదానాన్ని వీడాడు.

IND vs AUS: Navdeep Saini complains of groin pain, goes off field
బ్రిస్బేన్​ టెస్టు: గాయంతో మైదానాన్ని వీడిన సైనీ

By

Published : Jan 15, 2021, 10:59 AM IST

టీమ్‌ఇండియాకు గాయాలబెడద కొనసాగుతూనే ఉంది. బ్రిస్బేన్​ వేదికగా జరుగుతోన్న నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ సందర్భంగా పేసర్‌ నవ్‌దీప్‌ సైని గాయపడి మైదానం వీడాడు. అతడు 36వ ఓవర్‌ బౌలింగ్‌ చేస్తుండగా ఇబ్బంది పడడం వల్ల ఫిజియో వచ్చి పరీక్షించాడు. దీంతో సైని మైదానం వీడాడు. అయితే ఈ గాయంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

నిలకడగా ఆస్ట్రేలియా బ్యాటింగ్​

రెండో సెషన్‌లో ఆస్ట్రేలియా ఒక వికెట్‌ కోల్పోయి 89 పరుగులు చేసింది. దీంతో మొత్తం 54 ఓవర్లకు 154/3తో నిలిచింది. ప్రస్తుతం లబుషేన్‌(73*), మాథ్యూవేడ్‌(27*) క్రీజులో ఉన్నారు. 65/2తో రెండో సెషన్ కొనసాగించిన ఆస్ట్రేలియా కాసేపటికే జట్టు స్కోర్‌ 87 పరుగుల వద్ద స్టీవ్‌స్మిత్‌(36) వికెట్‌ కోల్పోయింది. వాషింగ్టన్‌ సుందర్‌ బౌలింగ్‌లో రోహిత్‌ క్యాచ్‌ అందుకోవడం వల్ల స్మిత్‌ పెవిలియన్‌ చేరాడు. తర్వాత లబుషేన్‌ అర్ధశతకం సాధించడానికి ముందే రెండు సార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. తొలుత రహానె అతడి క్యాచ్‌ వదలగా, తర్వాత స్లిప్‌లో పుజారా మరోసారి అందుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలోనే మాథ్యూవేడ్‌తో కలిసి లబుషేన్‌ అర్ధశతక భాగస్వామ్యంతో కొనసాగుతున్నాడు.

ఇదీ చూడండి:బ్రిస్బేన్​ టెస్టు: నటరాజన్​, సుందర్​ అరంగేట్రం

ABOUT THE AUTHOR

...view details