మూడో టీ 20లోనూ పరాజయం పాలైంది స్మృతి సేన. చివర్లో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో అమ్మాయిల జట్టు ఒక్క పరుగు తేడాతో ఓటమి చవిచూసింది. చివరి ఓవర్లో ఒకే ఒక్క పరుగిచ్చి రెండు వికెట్లు తీసింది ఇంగ్లీష్ బౌలర్ కేట్ క్రాస్. మూడు టీ 20ల టోర్నీలో ఇప్పటికే సిరీస్ కోల్పోయిన అమ్మాయిల జట్టు ఈ మ్యాచ్‌లోనూ ఓడిపోయింది. ఆఖరి ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేసిన కేట్ కే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది.
చివరి ఓవర్లో మూడు పరుగులు అవసరం కాగా భారతి నాలుగు బంతులాడి పరుగు చేయకుండా వెనుదిరిగింది. ఐదో బంతికి అనుజా పాటిల్ కీపర్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరింది. చివరి బంతికి మూడు పరుగులు రావాల్సి ఉండగా ఒక్క పరుగే లభించింది. ఆఖరు ఓవర్ వేసిన కేట్ క్రాస్ రెండు వికెట్లు తీసి భారత్‌ను దెబ్బతీసింది.