న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా దిగ్గజ బ్యాట్స్‌మెన్ కపిల్‌దేవ్, మహేంద్రసింగ్ ధోనీలను అధిగమించాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి ఏడు సార్లు అర్ధ శతకం బాదిన భారత క్రికెటర్‌గా కొత్త రికార్డు నెలకొల్పాడు.
జడేజా రికార్డు.. ఏడో స్థానంలో ఏడుసార్లు
న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రికార్డు నెలకొల్పాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన జడ్డూ అర్ధ శతకంతో ఆకట్టుకుని ఓ ఘనతనూ సాధించాడు.
కివీస్ తొలుత బ్యాటింగ్ చేసి 273 పరుగులు చేయగా ఛేదనలో 251 పరుగులకు ఆలౌటైంది భారత్. టీమిండియా స్కోరు 129 వద్ద ఉన్నప్పుడు శ్రేయస్ అయ్యర్ (52) ఆరో వికెట్‌గా వెనుదిరిగాక జడేజా ఏడో బ్యాట్స్‌మన్‌గా బరిలోకి దిగాడు. శార్దూల్ ఠాకుర్‌తో కలిసి 24 పరుగుల భాగస్వామ్యం నిర్మించిన అతడు నవ్‌దీప్ సైనీ (45)తో కలిసి ఎనిమిదో వికెట్‌కు కీలకమైన 76 పరుగులు జోడించాడు. ఆఖర్లో వీరిద్దరూ ఔటవ్వడం వల్ల భారత్ 22 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి ఏడు సార్లు అర్ధ శతకం బాదిన టీమిండియా క్రికెటర్‌గా కొత్త రికార్డు సృష్టించాడు జడ్డూ. ఇంతకుముందు మాజీ సారథులు కపిల్‌దేవ్, ఎంఎస్ ధోనీ ఈ స్థానంలో అత్యధికంగా ఆరుసార్లు అర్ధ శతకాలు నమోదు చేశారు.
ఇదీ చూడండి : పుల్లెల గోపీచంద్‌కు జీవన సాఫల్య పురస్కారం