తెలంగాణ

telangana

ETV Bharat / sports

'మన్కడింగ్​పై ఇంతకు ముందే చర్చించాం' - ipl

రాజస్థాన్ - పంజాబ్ మధ్య సోమవారం జరిగిన మ్యాచ్​లో 'మన్కడింగ్' చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా స్పందించారు.

రాజీవ్ శుక్లా

By

Published : Mar 26, 2019, 3:24 PM IST

రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్​మెన్ బట్లర్​ను... మన్కడింగ్ పద్ధతిలో అశ్విన్ ఔట్ చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐపీఎల్​లో ఇలా జరగడం ఇదే మొదటిసారి. క్రీడా స్ఫూర్తికి ఇది విరుద్ధమని క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా ఈ విషయంపై స్పందించారు. ఓ ఐపీఎల్ సీజన్ ప్రారంభంలో మన్కడింగ్​కి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఆ సమావేశంలో ధోని, కోహ్లి కూడా పాల్గొన్నారని చెప్పారు.

రాజీవ్ శుక్లా ట్వీట్

"మన్కడింగ్ విధానంలో బ్యాట్స్​మెన్​ను అవుట్ చేయడం సరైంది కాదని ఇంతకు ముందే జరిగిన ఓ సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం. ఓ ఐపీఎల్ సీజన్ ప్రారంభ సమయంలో దీనిపై చర్చించాం. ధోని, కోహ్లితో పాటు అన్ని జట్ల కెప్టెన్లు​, మ్యాచ్ రిఫరీలు హాజరయ్యారు "
- రాజీవ్ శుక్లా, ఐపీఎల్ ఛైర్మన్

ABOUT THE AUTHOR

...view details