ప్రఖ్యాత విశ్వవిద్యాలయం ఐఐటీ మద్రాస్ నిర్వహించిన ఓ సెమిస్టర్ పరీక్షలో క్రికెట్‌పై ఓ ప్రశ్న వచ్చింది. మంగళవారం చెన్నై సూపర్‌కింగ్స్, ముంబయి ఇండియన్స్ మధ్య క్వాలిఫయర్-1 జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌లో పిచ్ పరిస్థితులు ఉదాహరణగా చూపించి 5 మార్కులకు ప్రశ్న అడిగారు. విశేషమేంటంటే పిచ్‌పై తేమ, వాతావరణం వంటి అంశాలను విశ్లేషించి... టాస్ గెలిస్తే ధోనీ బ్యాటింగ్ ఎంచుకుంటాడా.?? ఫీల్డింగ్ ఎంచుకుంటాడా అనేది చెప్పాలని అడిగారు. సమాధానం సమర్థించుకునే దగినదిగా లేకపోతే మార్కులు ఇవ్వమని నోట్ పాయింట్లో తెలిపారు.
ఐఐటీ మద్రాస్ సెమిస్టర్ పరీక్షలో ధోనీపై ప్రశ్న - ధోనీపై ప్రశ్న
ఐపీఎల్... ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే సందడి. మరి అలాంటి వాటిపై యువత ఎక్కువగా దృష్టిపెడతారని ఓ ఫ్రొఫెసర్ ఆలోచించారు. ఇంకేముంది దానిపైనే సెమిస్టర్ పరీక్షలో ప్రశ్న సంధించారు. ఈ విషయం ప్రస్తుతం నెట్టింట వైరల్ అయింది.
ఐఐటీ మద్రాస్ సెమిస్టర్ పరీక్షలో ధోనీపై ప్రశ్న
దీన్ని తాజాగా ఐసీసీ తన ట్విట్టర్లో పోస్టు చేసింది. ప్రొఫెసర్ చేసిన పనిని మెచ్చుకుంటూ... నిజ జీవిత అంశాలతో పరీక్షలు నిర్వహించడం బాగుందని ప్రశంసలు కురిపించింది. ధోనీ మరి టాస్ గెలిస్తే ఏం ఎంచుకుంటాడో చెప్పాలని అభిమానులను కోరింది ఐసీసీ.