మైదానం ఆవల తమ జట్టు పూర్తి భిన్నంగా ఉంటుందని ముంబయి ఇండియన్స్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు. అందులో విచిత్రమైన మనస్తత్వాలు కనిపిస్తాయని అన్నాడు. ఐపీఎల్ సీజన్ ఆరంభ మ్యాచ్‌కు ముందు అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు.
హార్దిక్, పొలార్డ్ల మరోవైపు చూస్తే షాకవుతారు: సూర్య - SURYA KUMAR MUMBAI INDIANS
ముంబయి జట్టులో విచిత్ర మనస్తత్వాలు కనిపిస్తాయని సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు. పొలార్డ్, హార్దిక్ పాండ్య గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'డ్రస్సింగ్ రూమ్‌లో మా జట్టు వైవిధ్యంగా ఉంటుంది. మైదానంలో చూసిన దానికి వ్యతిరేకంగా కనిపిస్తుంది. అక్కడి వాతావరణాన్ని సరదాగా మార్చేసే ఆటగాళ్లు ఉన్నారు. ఇషాన్ కిషన్, కీరన్ పొలార్డ్, హార్దిక్ పాండ్య.. గెలిచినా ఓడినా సరదాగానే ఉంటారు. వాళ్లను మరోవైపు నుంచి చూస్తే మీరు షాకవుతారు! ఎందుకంటే డ్రస్సింగ్ రూమ్‌లో వింత వింత మనస్తత్వాలు కనిపిస్తాయి' అని సూర్యకుమార్ తెలిపాడు.
'వారి వల్లే ఫలితాల ప్రభావం మాపై ఉండదు. మేం గెలిస్తే వాతావరణం చాలా బాగుంటుంది. ఓడినా.. సంతోషకరమైన వాతావరణం ఉండేలా చేస్తారు. గెలిచినా.. ఓడినా.. ఒకే రకంగా ఉండటం ద్వారానే మనలో అత్యుత్తమ ఆటతీరును బయటపెట్టేందుకు ఆస్కారం ఉంటుంది' అని సూర్య చెప్పాడు.