తెలంగాణ

telangana

ETV Bharat / sports

'కోహ్లీ లేకపోయినా టీమ్​ఇండియా సిద్ధంగా ఉండాలి'

సవాళ్లను స్వీకరించి ఎదుర్కొనేందుకు టీమ్​ఇండియా సిద్ధంగా ఉండాలని దిగ్గజ క్రికెటర్​ సచిన్​ చెప్పాడు​. ఆసీస్​తో టెస్టు సిరీస్​లో సారథి కోహ్లీ, ఇషాంత్​ శర్మ దూరమైన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశాడు. డిసెంబరు 17 నుంచి ఇరుజట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది.

sachin
సచిన్​

By

Published : Dec 9, 2020, 2:36 PM IST

ఆస్ట్రేలియాతో తొలి టెస్టు తర్వాత కెప్టెన్ కోహ్లీ లేకపోయినా సరే ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని దిగ్గజ క్రికెటర్​ సచిన్​ తెందుల్కర్​.. టీమ్​ఇండియాలో ధైర్యాన్ని నింపాడు. విరాట్​ గైర్హాజరీతో మరో ఆటగాడికి అవకాశం లభిస్తుందని అన్నాడు.

"పితృత్వ సెలవుల వల్ల కోహ్లీ తొలి టెస్టు తర్వాత స్వదేశానికి తిరిగి రానున్నాడు. దీంతో టీమ్​ఇండియా అతడిని మిస్​ అవుతుంది. కీలక
ఆటగాడు దూరమైనా సరే ముందుకు సాగేలా జట్టు సంసిద్ధంగా ఉండాలి. గతంలో వెస్టిండీస్​తో టెస్టు సిరీస్​ ఆడేటప్పుడు అనిల్​ కుంబ్లే గాయపడ్డాడు. ఆ సమయంలో అతడే కీలక బౌలర్​. తను లేకుండానే మేం ఆడాం. ఇలాంటి సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. అయినా టీమ్​ఇండియాకు ప్రతిభ ఉన్న బెంచ్​ ఆటగాళ్లు ఉన్నారు. కాబట్టి విరాట్​ గైర్హాజరీతో మరో ఆటగాడికి అవకాశం లభిస్తుంది"

-సచిన్​ తెందుల్కర్​, భారత దిగ్గజ క్రికెటర్​

రోహిత్​ శర్మ ఫిట్​నెస్​పై తనకు ఎలాంటి సమాచారం తెలియదని సచిన్ చెప్పాడు​. హిట్​మ్యాన్​ ఒకవేళ ఫిట్​నెస్​ పరీక్షల్లో పాసైతే ఆస్ట్రేలియాకు అతడిని కచ్చితంగా పంపించాలని అన్నాడు. అక్కడి పిచ్​లపై బాగా రాణించగల సత్తా అతడికి ఉందని అభిప్రాయపడ్డాడు. ఇషాంత్​ లేకపోవడం బౌలింగ్​ విభాగానికి ఓ సవాల్​ లాంటిదని మాస్టర్ చెప్పాడు​. పరిమిత ఓవర్ల సిరీస్​లో టి.నటరాజన్​ అద్భుతంగా ఆడాడని ప్రశంసించాడు. టెస్టుల్లో టి.నటరాజన్​ను ఎంపిక చేయడం అనేది సెలక్టర్ల నిర్ణయమని తెలిపాడు.

ఇదీ చూడండి : దిగ్గజ సచిన్​కు ఆటో డ్రైవర్​ సాయం

ABOUT THE AUTHOR

...view details