తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆల్​రౌండర్​గా హార్దిక్​కు ప్రత్యామ్నాయం ఎవరు?

ఆల్​రౌండర్​ హార్దిక్​ పాండ్య ఫిట్​గా లేనప్పుడు యాజమాన్యం ఆరో బౌలింగ్​ ప్రత్యామ్యాయాన్ని ఎందుకు సిద్ధం చేసుకోలేదని ప్రశ్నించాడు టీమ్​ఇండియా మాజీ ఓపెనర్​ గంభీర్​. ఒకవేళ పాండ్య స్థానాన్ని విజయ్​ శంకర్​తో భర్తీ చేస్తే.. అతడు ప్రభావితంగా ఆడగలడా అని సందేహం వ్యక్తం చేశాడు.

hardik pandya
హార్దిక్​

By

Published : Nov 28, 2020, 5:02 PM IST

టీమ్​ఇండియాకు ఆరో బౌలింగ్​ ప్రత్యామ్నాయం లేకపోవడం అతి పెద్ద సమస్యగా పేర్కొన్నాడు మాజీ క్రికెటర్​ గంభీర్​. గతసారి ప్రపంచకప్ జరిగినప్పటి​ నుంచి ఈ సమస్య జట్టును వెంటాడుతుంటే.. యాజమాన్యం ఎందుకు ఇంకా పరిష్కారం వెతకలేదని ప్రశ్నించాడు. శుక్రవారం ఆసీస్​తో జరిగిన తొలి వన్డేలో ఆల్​రౌండర్​ హార్దిక్​ బౌలింగ్​ చేయలేదు. ఈ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశాడు గంభీర్​.

​"గతేసారి ప్రపంచకప్​ జరిగినప్పటి నుంచి ఆరో బౌలర్​ సమస్య ఉంది. ఆల్​రౌండర్​ హార్దిక్​ పాండ్యా బౌలింగ్​కు ఫిట్​గా లేనప్పుడు అతడి స్థానంలో బౌలింగ్​ ప్రత్యామ్నాయం ఏది? ఒకవేళ రోహిత్​ శర్మ జట్టులోకి తిరిగొచ్చినా ఆ సమస్యను ఎదుర్కొవాల్సిందే. తొలి ఆరు స్థానాల్లో ఉన్న బ్యాట్స్​మెన్​లో బౌలింగ్​ చేసే ఆటగాడు లేడు. అదే ఆస్ట్రేలియా వైపు ఆల్​రౌండర్లు హెన్రిక్స్​, సీన్​ అబాట్​ బ్యాటింగ్​, బౌలింగ్​లో రాణించగలరు. కానీ టీమ్​ఇండియాలో పరిస్థితి అలా లేదు? హార్దిక్​ గాయమైనప్పటి నుంచి ఆ సమస్యను పరిష్కరించకుండా అలానే వదిలేశారు. ఒకవేళ అతడి స్థానాన్ని విజయ్​ శంకర్​తో భర్తీ చేస్తే​.. నెం.5 లేదా ఆరు స్థానాల్లో అతడు ప్రభావం చూపే బ్యాటింగ్​ చేయగలడా? కచ్చితంగా ఎనిమిది తొమ్మిది ఓవర్లు బౌలింగ్​ చేయగలడా?"

-గంభీర్​, టీమ్​ఇండియా మాజీ ఓపెనర్​.

సిడ్నీ వేదికగా శుక్రవారం జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా​ చేతిలో 67 పరుగుల తేడాతో ఓటమి పాలైంది టీమ్​ఇండియా. విజయంలో ఫించ్(114), స్మిత్(105) సెంచరీలతో కీలక పాత్ర పోషించారు. ఫలితంగా వన్డే సిరీస్​లో ఆసీస్​ 1-0తో ఆధిక్యంలో నిలిచింది.

ఇదీ చూడండి : అప్పుడే బౌలింగ్​ చేస్తా: హార్దిక్​ పాండ్య

ABOUT THE AUTHOR

...view details