పాకిస్థాన్ బ్యాట్స్‌మన్ ఇమామ్ ఉల్ హక్‌ను ఐలాండ్ క్రికెట్ బోర్డు దారుణంగా ట్రోల్ చేసింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో అతడిని ఓపెనర్‌గా తీసుకురావడం ఆ జట్టుకు సరైన ఫలితాన్ని ఇవ్వలేదు. హారిస్ సోహైల్‌ను పక్కనపెట్టి ఇమామ్‌కు చోటిచ్చింది పాక్ యాజమాన్యం. తొలి ఇన్నింగ్స్‌లో రెండు పరుగులే చేసి మిచెల్‌స్టార్క్ బౌలింగ్‌లో ఔటైన అతడు రెండో ఇన్నింగ్స్‌లో డకౌటయ్యాడు. ఫలితంగా పాకిస్థాన్ అభిమానుల విమర్శలకు గురవుతున్నాడు.
పాక్ అభిమానులతో పాటు ఐలాండ్ క్రికెట్ బోర్డు తమ అధికారిక ట్విట్టర్‌లో ఇమామ్‌ను ట్రోల్ చేసింది. "ఇమామ్ ఉల్ హక్ టెస్టు కెరీర్‌లో మొత్తం చేసిన పరుగుల కన్నా డేవిడ్ వార్నర్ గత రెండు ఇన్నింగ్స్‌ల్లో చేసిన పరుగులే ఎక్కువ" అంటూ ట్వీట్ చేసింది.