తెలంగాణ

telangana

ETV Bharat / sports

'టెస్టు ఛాంపియన్​షిప్​ కోసం ఎదురుచూస్తున్నాం' - విరాట్ కోహ్లీ

ఐసీసీ టెస్టు ఛాంపియన్​షిప్​ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నామని టీమిండియా సారథి విరాట్ కోహ్లీ తెలిపాడు. ఈ టోర్నీతో టెస్టు ఫార్మాట్​కు ఆదరణ పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.

'టెస్టు ఛాంపియన్​షిప్​ కోసం ఎదురుచూస్తున్నాం'

By

Published : Jul 29, 2019, 2:18 PM IST

త్వరలో ప్రారంభం కానున్న ప్రపంచ ఛాంపియన్​షిప్​పై స్పందించాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. అంతర్జాతీయ క్రికెట్​ మండలి(ఐసీసీ) తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సంప్రదాయ టెస్టు ఫార్మాట్​కు ఆదరణ పెరుగుతుందని చెప్పాడు.

"మేం చాలా ఉత్సాహంతో టెస్టు ఛాంపియన్​షిప్​ కోసం ఎదురు చూస్తున్నాం. భవిష్యత్తులో దీనికి ఆదరణ పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. టెస్టుల్లో ఆడటం నిజంగా ఒక సవాలుగా ఉంటుంది.మా జట్టు కొన్నేళ్ల నుంచి ఈ ఫార్మాట్​లో అద్భుతంగా రాణిస్తోంది. అదే ఫామ్​ను ఈ ఛాంపియన్​షిప్​లోనూ కొనసాగిస్తాం." -విరాట్ కోహ్లీ, టీమిండియా కెప్టెన్

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ

యాషెస్​తో ప్రారంభం కానున్న టెస్టు ఛాంపియన్​షిప్ రెండేళ్ల పాటు జరగనుంది. భారత్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్ జట్లు మొత్తం 27 సిరీస్​ల్లో 71 మ్యాచ్​లు ఆడనున్నాయి.

ప్రతి జట్టు ఇంటా బయట తలో మూడు సిరీస్​లు ఆడుతుంది. ఒక్కో మ్యాచ్​ గెలిచిన జట్టుకు పాయింట్లు లభిస్తాయి. సిరీస్​లన్నీ పూర్తయ్యాక తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు 2021జూన్లో ఇంగ్లాండ్​ వేదికగా ఫైనల్​లో తలపడతాయి

ఇది చదవండి: టెస్ట్​ క్రికెటర్లను గుర్తు పట్టడం మరింత సులువు

ABOUT THE AUTHOR

...view details